Telugu Gateway
Top Stories

నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లపై వేటు

నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లపై వేటు
X

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) దేశంలోనే అతి పెద్ద ఐటి కంపెనీ. ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం ఒకటి మాత్రం పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి. అది ఏంటి అంటే టిసిఎస్ కు చెందిన నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఉద్యోగ నియామకాలకు సంబంధించి వంద కోట్ల రూపాయల మేర లంచాలు స్వీకరించారు. మానవ వనరులను సరఫరా చేసే కంపెనీల నుంచి ఆ నలుగురు ఎగ్జిక్యూటివ్ లు కమిషన్ ల రూపంలో ఈ మొత్తం తీసుకున్నారు .వీరు అంతా మానవవనరుల నిర్వహణ గ్రూప్ (ఆర్ఎంజీ)లో పనిచేస్తున్న వారే. ఈ విషయం వెలుగులోకి రావటంతో టిసిఎస్ ఆ నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లపై వేటు వేసింది. దిగ్గజ ఐటి కంపెనీగా ఉన్న టిసిఎస్ ప్రతి ఏటా పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగులను తీసుకుంటుంది అనే విషయం తెలిసిందే.

కంపెనీలో సాగుతున్న అనైతిక కార్యక్రమాల విషయంలో ఒక వ్యక్తి దీనిపై సమాచారం ఇవ్వగా కంపెనీ చర్యలు చేపట్టింది. ఆర్ఎంజీ లోని గ్లోబల్ హెడ్ ఈ ఎస్ చక్రవర్తి ఉద్యోగులను సరఫరా చేసే సంస్థల నుంచి కమిషన్ తీసుకుంటున్నట్లు టిసిఎస్ సీఈఓ తో పాటు సిఓఓ కు కూడా ఫిర్యాదు అందింది. ఈ ఆరోపణలపై కంపెనీ ముగ్గురు ఉద్యోగులతో ఒక కమిటీ ని ఏర్పాటు చేసి విచారణ జరిపించగా...ఈ ఆరోపణలు నిజమే అని తేలటంతో అందరిపై వేటు వేశారు. గత మూడేళ్ళ కాలంలో టిసిఎస్ ఏకంగా మూడు లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంది. ఈ పరిణామాలతో కంపెనీలోని టాప్ టీం అంతా షాక్ లో ఉంది అని చెపుతున్నారు.అయితే ఈ వార్తలపై కంపెనీ ఎక్కడా ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు. తొలుత ఈ విషయాన్ని మింట్ వెలుగులోకి తెచ్చింది.

Next Story
Share it