వంద నిమిషాల్లోనే 30213 కోట్ల ఇష్యూ సక్సెస్

జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ (జెపీఎల్) ఐపీవో ఫస్ట్ డే నే సరికొత్త రికార్డు లు నమోదు చేసింది. స్టాక్ మార్కెట్ నుంచి 30213 కోట్ల రూపాయలు సమీకరించేందుకు వచ్చిన ఈ సంస్థ తొలిరోజే ఎన్నో సంచలనాలకు వేదికైంది. దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా నిలవటమే కాకుండా ప్రారంభం అయిన వంద నిమిషాల్లోనే రికార్డు స్పందనను దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచిన జియో ప్లాట్‌ఫామ్స్ రూ.30,213 కోట్ల ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ ఐపీఓ కేవలం 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. తాజా గణాంకాల ప్రకారం, ఈ ఇష్యూ 1.14 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) కోసం కేటాయించిన వాటా 3.68 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇప్పటివరకు ఈ ఐపీఓకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అక్టోబర్ 23 వరకు ఈ ఇష్యూలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.



