Telugu Gateway
Top Stories

జార్జ్ సోరోస్ మోగించిన అదానీ సైరన్

జార్జ్ సోరోస్ మోగించిన అదానీ సైరన్
X

‘ప్రధాని మోడీ, గౌతమ్ అదానీ సన్నిహిత మిత్రులు. వీరిద్దరి జాతకం అల్లుకుపోయింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో భారత్ లో మోడీ ప్రభావం తగ్గుతుంది. దేశంలో మరిన్ని సంస్థాగత సంస్కరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. నేను అమాయకుడిని కావచ్చు. కానీ భారత్ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది.’ ఇవీ జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరిగిన సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఇన్వెస్టర్లకు మోడీ సమాదానం చెప్పాలని ..అయన ఇంతవరకు అదానీ ఎపిసోడ్ పై మాట్లాడలేదు అని తప్పు పట్టారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకు పడింది. కొన్ని విదేశీ శక్తులు మన ప్రజాస్వామ్యాన్ని టార్గెట్ చేసుకుని బలహీన పరచేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆక్షేపించారు. . శుక్రవారం నాడు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జార్జి సోరోస్ తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలనుకోవడం ఆయన ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు . ప్రధాని మోదీ వంటి వారిని టార్గెట్‌గా చేసుకునేందుకే ఆయన బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించినట్టు మంత్రి విమర్శించారు. ఇండియాలో ప్రతి ఐదేళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నామని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. దేశ ప్రజాస్వామ్యం ఎప్పటికీ చెక్కుచెదరదని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచేందుకు ఎవరెన్ని దుష్ట పన్నాగాలు పన్నినా ప్రధాని మోదీ నాయకత్వంలో బలంగా ఎదుర్కుంటామని అన్నారు.

జార్జి సోరోస్ తన శక్తియుక్తులను ఇండియాకు కాకుండా తన దేశానికి లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తుంటారని, అదానీ గ్రూప్ అంశంపై ఆయన ఆలోచనా ప్రక్రియ, ప్రకటనలను భారతీయులంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ''ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంపై ప్రధాని మోదీని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో పాటు, ఇంగ్లాడ్ ప్రధాని బహిరంగంగా ప్రశంసించారు. ఇలాంటి తరుణంలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారు వ్యాఖ్యలు వెలుగుచూశాయి'' అని స్మృతి ఇరానీ అన్నారు. జార్జి సోరోస్ ఎవరికి నిధులు ఇస్తున్నారనే విషయం మీడియా వ్యక్తులందరికీ బాగా తెలుసునని, ఆయన మోదీని లక్ష్యంగా చేసుకున్నారని, భవిష్యత్తులో కూడా ఆయన టార్గెట్ అదే విధంగా ఉండబోతోందని చెప్పారు.గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో తలెత్తిన అలజడితో స్టాక్ మార్కెట్ కుదేలయిందని, పెట్టుబడి అవకాశాలకు తలుపులు బార్లా తెరిచిన ఇండియాపై విశ్వాసానికి ఇది కుదుపులాంటిందని, మరిన్ని సంస్థాగత సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని జార్జి సోరోస్ అన్నారు. ఇండియాలో పెట్టుబడిదారుల విశ్వాసానికి విఘాతం కలిగించే విధంగా అదానీపై ఇటీవల హిండెన్ బర్గ్ వ్యాఖ్యలు చేసిన క్రమంలో జార్జి సోరోస్ తాజా వ్యాఖ్యలు చేశారు. జార్జ్ షొరెస్ కామెంట్స్ ను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా తప్పుపట్టారు. దేశం లో ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు చేసుకుంటాయని...ఇతర దేశాల వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు.

Next Story
Share it