Telugu Gateway
Top Stories

గౌత‌మ్ అదానికి జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త‌

గౌత‌మ్ అదానికి జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త‌
X

కేంద్ర ప్ర‌భుత్వం ఆసియాలోనే అత్యంత ధ‌నికుడైన పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీకి జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది. ఆయ‌న భ‌ద్ర‌త‌కు ముప్పు ఉన్న‌ట్లు నిఘా వ‌ర్గాలు వెల్ల‌డించిన స‌మాచారం మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ భ‌ద్ర‌త‌కు అయ్యే వ్య‌యాన్ని అదానీనే భ‌రించ‌నున్న‌ట్లు తాజాగా వెల్ల‌డైంది. ఈ అర‌వై ఏళ్ళ పారిశ్రామిక‌వేత్త కోసం ఏకంగా 30 మంది సాయుధ బ‌ల‌గాల‌ను రంగంలోకి దించ‌నున్నారు. జెడ్ కేట‌గిరి అనేది దేశంలోనే మూడ‌వ అత్యంత భ‌ద్ర‌తా విభాగం గా ప‌రిగ‌ణిస్తారు.

గౌత‌మ్ అదానీ ఆస్తులు 130 బిలియ‌న్ డాల‌ర్లుగా అంచ‌నా. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వ‌ర్గాల వెల్ల‌డించాయ‌ని ది ప్రింట్ క‌థ‌నం వెల్ల‌డించింది. జెడ్ కేట‌గిరి కింద అంటే నలుగురి నుంచి ఐదుగురు నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డు (ఎన్ ఎస్ జీ) క‌మాండోల‌తో పాటు ఇత‌ర పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. మొత్తం మీద 30 ముంది సాయుధులైన భ‌ద్ర‌తా సిబ్బందిని ఆయ‌న కోసం కేటాయిస్తారు. ఇప్ప‌టికే మ‌రో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అయిన ముఖేష్ అంబానీ కూడా జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it