మళ్ళీ కోవిడ్ కేసుల కలకలం

దేశంలో కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయని భావిస్తున్న తరుణంలో మళ్ళీ కలకలం. అకస్మాత్తుగా కేసుల్లో పెరుగుదల అందోళన కలిస్తోంది. అయితే ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుందా..ఈ కేసుల తీవ్రత ఎలా ఉంది అన్న అంశాలపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. అందరూ మాస్క్ లు కూడా తీసేసి తిరుగుతున్న సమయంలో దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇటీవల వరకూ దేశ వ్యాప్తంగా వెయ్యి లోపు నమోదు అయిన కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా
2,183కు చేరాయి. అదే సమయంలో మరణాలు కూడా 214 గా ఉన్నాయి.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,542 యక్టీవ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ముఖ్యంగా కేరళ, ఢిల్లీలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో 940 కేసులు రాగా, ఢిల్లీలో 517 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తి చాలా వేగంగా ఉన్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. అయితే కొత్త వేరియంట్ల నుంచి రక్షణ పొందేందుకు వీలుగా ఇప్పటికే దేశంలో ప్రికాషనరీ డోస్ ( బూస్టర్ డోస్)కు అనుమతించిన విషయం తెలిసిందే.