Telugu Gateway
Top Stories

కాలిపోయిన ఆ కార్ల విలువ 1150 కోట్ల రూపాయ‌లు!

కాలిపోయిన ఆ కార్ల విలువ 1150 కోట్ల రూపాయ‌లు!
X

ఖ‌రీదైన కార్ల‌తో కూడిన ఓ కార్గో ఓడ ఇటీవ‌ల జ‌ర్మ‌నీ నుంచి అమెరికా వెళుతూ అగ్ని ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే.అట్లాంటిక్ స‌ముద్రంలో ఈ ఓడ 4000 కార్ల‌తో బ‌య‌లుదేరింది. కానీ పోర్చుగ‌ల్ వ‌ద్ద అగ్నికి ఆహుతి అయింది. ఇందులో సిబ్బంది మాత్రం సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డారు కానీ..కార్లు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ కీల‌క స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ప్ర‌మాదంలో కాలిపోయిన కార్ల విలువ ఏకంగా 1150 కోట్ల రూపాయ‌లుగా ఉంటుంద‌ని ఓ నివేదిక వెల్లడించింది. ఈ మేర ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ వోక్స్ వ్యాగ‌న్ కు న‌ష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి విలువైన వాహ‌నాల‌ను త‌ర‌లించే స‌మ‌యంలో ఎలాంటి ప్ర‌మాదాలు జరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు బీమా చేస్తుంటారు.

అయితే బీమా కంపెనీలు ప‌రిస్థితులు అన్నింటిని మ‌దింపు చేసి కానీ నిర్ణ‌యం తీసుకోవు. ఇందులో వోక్స్ వ్యాగన్ గ్రూపున‌కు చెందిన ప్రీమియం బ్రాండ్లు పోర్షే, ఆడి, బెంట్లీ, ఇత‌ర ఎల‌క్ట్రిక్ కార్లు ఉన్నాయి. అయితే ఇంత భారీ స్థాయిలో కార్లు, కారు బ్యాట‌రీలు కాలిపోవ‌టం వ‌ల్ల వ‌చ్చే కాలుష్యంపై కూడా నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఓ వైపు అస‌లే చిప్ ల కొర‌త‌తో కార్ల త‌యారీ దారుణంగా ప‌డిపోయిన త‌రుణంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకోవటంతో అంత‌ర్జాతీయ మార్కెట్లో కార్ల కొర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. డీల‌ర్ల వ‌ద్ద కొత్త కార్లు పెద్ద‌గా అందుబాటులో లేక‌పోవ‌టంతో ఉన్న వాటి ధ‌ర‌ల‌ను పెంచ‌టంతో పాటు వాడిన కార్ల‌కు కూడా అదిరిపోయే రేట్లు చెబుతున్నారు.

Next Story
Share it