వైసీపీ లో షర్మిల కల్లోలం తప్పదా?
ప్రస్తుతం వైసీపీ తరపున కడప ఎంపీగా ఉన్న వై ఎస్ అవినాష్ రెడ్డి మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివేకా ఆలోచన కూడా కడప ఎంపీ బరిలో తాను లేదంటే వై ఎస్ విజయమ్మ, షర్మిల ఎవరో ఒకరు బరిలో ఉండాలని చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వై ఎస్ షర్మిలను కడప ఎంపీ బరిలో దింపటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఏమైనా లెక్క తేడా వచ్చినా కూడా షర్మిల రాజ్య సభ సీట్ ఎలాగు ఉంటుంది అని ఒక కీలక నేత ఒకరు వెల్లడించారు. రాహుల్ గాంధీ ని ప్రధాని చేయటమే తన లక్ష్యం అని గతంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు అని . ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరినా తన తండ్రి ఆశయ సాధన కోసం అని చెప్పుకోవచ్చు ...దీని వల్ల పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవన్నది ఈ ప్రతిపాదన తెరపైకి తెస్తున్న వారి వాదన. మరి రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించటం తో పాటు లోక్ సభ ఎన్నికల్లో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సారి తిరిగి ఖాతా ఓపెన్ చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.