ఆయన రాజకీయాలు వదిలేసినా..ఆయన్ను వదలని రాజకీయాలు
రాజకీయాలకు దూరం అయి . ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టినా ఆయన్ను మాత్రం రాజకీయాలు వీడటం లేదు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సోషల్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ దూరంగా ఉండటంపై తెలుగు దేశం అభిమానులు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు ఈ హీరోను . ఈ దూషణలు మరీ అతిగా సాగాయి అనే విమర్శలు ఉన్నాయి. ఏడాది పాటు జరిగిన ఏ ఒక్క కార్యక్రమానికి పిలవకుండా కేవలం జూ ఎన్టీఆర్ పుట్టిన రోజున అంటే మే 20 వ తేదీన తలపెట్టిన కార్యక్రమానికి మాత్రం పిలిచారు. హైదరాబాద్ లో అయితేనే తాను వస్తానని ఎన్టీఆర్ ఏమి షరతు పెట్టలేదు కదా. చివరకు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పత్రికలో ఇచ్చిన యాడ్ విషయంలోనే కొంత మంది విమర్శలు గుప్పించారు. మళ్ళీ వచ్చాడు అండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారు.