Telugu Gateway
Telugugateway Exclusives

జూబ్లిహిల్స్ సొసైటీ అక్రమార్కులకు ఆ ఎంపీ అండ ఎందుకు?

జూబ్లిహిల్స్ సొసైటీ అక్రమార్కులకు ఆ ఎంపీ అండ ఎందుకు?
X

పాలక మండలి మారాక జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశాలు మాత్రం చాలానే ఉన్నాయంటున్నాయి నూతన పాలకవర్గం. ఓ బడా కార్పొరేట్ సంస్థకు అప్పగించిన స్థలం వ్యవహారంతో పాటు 'ఒకే పేరు'ను అడ్వాంటేజ్ గా తీసుకుని చేసిన మరో ప్లాట్ వ్యవహారంలో గోల్ మాల్, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై కొత్త పాలక మండలి ఫోకస్ పెట్టింది. అయితే ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలా అనే అంశంపై అక్రమార్కులు ఇఫ్పటికే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతం నుంచి ఓ ఎంపీ అక్రమార్కులకు అండగా నిలుస్తూ వస్తున్నారు. చాలా కాలం పాటు కేసు నమోదు కాకుండా అడ్డుకోవటంలో కూడా ఆ ఎంపీ పాత్ర ఉన్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ వీరికి అంతగా కొమ్ముకాయటానికి కారణాలు ఏమిటి అనే అంశంపై కూడా కమిటీ సభ్యులు ఫోకస్ పెట్టారు. అధికార కేంద్రానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన ఇటీవల వరకూ అయితే అక్రమార్కులను బాగానే రక్షించుకుంటూ వచ్చారు.

అయితే రాబోయే రోజుల్లో ఇది ఏ మేరకు సాధ్యం అవుతుంది అన్నది వేచిచూడాల్సిందే అంటున్నారు. సదరు ఎంపీ అక్రమార్కులకు అండగా ఉండటానికి రకరకాల కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో జూబ్లిహిల్స్ అక్రమాల వ్యవహారం ఎన్నో కొత్త మలుపులు తిరగటం ఖాయం అని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతిగా ఉన్నందున నూతన కమిటీ తదుపరి చర్యలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కన్పిస్తోంది. ఈ వేవ్ కాస్త సడలిన తర్వాత అసలు కథ ఉంటుందని ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ప్రతినిధి వెల్లడిచాంరు. మరి ఆ ఎంపీ అప్పుడు కూడా అక్రమార్కులకు అండగా నిలుస్తారా? లేక పక్కకు తప్పుకుంటారా అన్నది వేచిచూడాల్సిందే. గత పాలక మండలి చేసిన అక్రమాలకు సంబంధించిన ప్రతి దానికి పక్కా ఆధారాలు ఉన్నందున..ఇప్పటికీ ఆ ఎంపీ జోక్యం చేసుకునే పరిస్థితి డైరక్ట్ ఎటాక్ కు దిగాలని పాలక మండలి అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Next Story
Share it