Telugu Gateway
Telugugateway Exclusives

అదానీపై మోడీ సైలెంట్ ..లిక్కర్ స్కాం పై కెసిఆర్..కేటిఆర్ నో కామెంట్

అదానీపై మోడీ సైలెంట్ ..లిక్కర్ స్కాం పై కెసిఆర్..కేటిఆర్ నో కామెంట్
X

అదానీపై మోడీ సైలెంట్ ..లిక్కర్ స్కాం పై కెసిఆర్..కేటిఆర్ నో కామెంట్

లక్షల కోట్ల రూపాయల మేర మదుపరుల సంపద గాలిలో కలిసిపోవడానికి కారణం అయిన అదానీ స్కాం పై ప్రధాన మంత్రి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడరు. ప్రతిపక్షాలు అన్ని ఒక్కటై జేపీసీ కి డిమాండ్ చేస్తున్నా మోడీ మాత్రం అసలేమీ జరగనట్లు వ్యవరిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దగ్గర నుంచి అధికారులు కూడా అంతా ఒకటే మాట. అదేంటి అంటే నియంత్రణ సంస్థలు చూసుకుంటాయని.. పన్ను స్వర్గధామ దేశాల్లో కుప్పలు తెప్పలుగా షెల్ కంపెనీలు పెట్టి...అటు నుంచి అదానీ కంపెనీల్లోకి నిధులు మళ్లించిన వంటి సీరియస్ విషయాలు ఎలాంటి విచారణ లేకుండా సెబీ వంటి సంస్థలు తేల్చగలవా అంటే అది జరిగే పని కాదు. ప్రధాని మోడీ దగ్గర నుంచి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ , ఇతర అధికారుల స్పందన చూస్తుంటే..వీళ్లు అందరు కలిసి అదానీ ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. అందుకే ఇంత పెద్ద స్కాం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా అదానీ పేరు ఎత్తటానికి కూడా ప్రధాని మోడీ ఇష్టపడటం లేదు అంటే ఈ విషయం అందరికి అర్ధం అవుతూనే ఉంది. అదానీ స్కాం పై జేపీసీ వేయాలని తెలంగాణాలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర నుంచి ఆయన తనయుడు, మంత్రి కేటిఆర్, కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు.

ఇందులో ఎక్కడా తప్పు పట్టాల్సింది ఏమి లేదు. కానీ ఇదే సీఎం కెసిఆర్, మంత్రి కేటిఆర్ లు మాత్రం లిక్కర్ స్కాం లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం నోరు విప్పి ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇప్పటికే విచారణ సంస్థలు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కు సంబదించిన ఆధారాలు దొరక్కుండా చేసేందుకు పది ఫోన్లను ధ్వంసం చేసినట్లు తేల్చాయి. వీటితోపాటు ఢిల్లీ, హైదరాబాద్ లో కవిత లిక్కర్ పాలసీ ఖరారు సమావేశాల్లో పాల్గొన్నట్లు తేల్చారు. ఇంత జరిగినా కూడా అటు కెసిఆర్ కానీ, ఇటు కేటిఆర్ కానీ తమ కుటుంబ సభ్యురాలిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలపై మాత్రం ఒక్కసారి కూడా స్పందించలేదు. కానీ ఇదే కెసిఆర్, కేటిఆర్, కవితలు మాత్రం అదానీ విషయంలో మోడీ మాట్లాడాలి..జేపీసీ వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ను ఎవరూ తప్పు పట్టరు. కానీ మరి నేరుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్సీ కవిత విషయంలో కెసిఆర్, కేటిఆర్ వ్యవహరిస్తున్న తీరు ద్వంద ప్రమాణాలు కావా?.గతం లో ఇదే కెసిఆర్ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ల విషయం లో వ్యవరించినట్లు తన కుమార్తె కవిత విషయంలో వ్యవరించటంలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it