Telugu Gateway
Telugugateway Exclusives

సోము వీర్రాజు పని బండి సంజయ్ ఎందుకు చేశారు?

సోము వీర్రాజు  పని బండి సంజయ్ ఎందుకు చేశారు?
X

ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు సైలంట్ తోనే బండి ఎంట్రీ ఇచ్చారా?

సహజంగా ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు. సహజంగా ఏదైనా ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాల నేతలు రావటం..మాట్లాడటం సహజమే. కానీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అకస్మాత్తుగా ఏపీ రాజకీయాలపై మాట్లాడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పోనీ సోము వీర్రాజు ఏమీ అంత సైలంట్ గా డే వ్యక్తేమీ కాదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబుపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో సాగిన అక్రమాలపై మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉండేవారు. అలాంటి ఫైర్ బ్రాండ్ సోమువీర్రాజు లో రాజకీయ ఫైర్ ఎందుకు తగ్గింది?. ఇది ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో. ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఏ ఎన్నికల్లోనూ ఇంత దారుణంగా ఓ మతానికి సంబంధించిన అంశాలపై మాట్లాడుతూ మీకు బైబిల్ కావాలా?. భగవద్గీత కావాలా? తేల్చుకోండి అని వ్యాఖ్యానించటం షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. ఎన్నికల ఏజెండాగా బైబిల్, భగవద్గీతలు ఉంటాయా?. లేక ప్రభుత్వాల పనితీరు...అభ్యర్ధుల సత్తా..అభివృద్ధి ఉంటుందా?. తెలంగాణలో బండి సంజయ్ ఫార్ములా వర్కవుట్ అవటంతో ఏపీలోనూ అదే మోడల్ పాలో అయ్యేందుకు బిజెపి రెడీ అయినట్లు కన్పిస్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది. తమ ఏజెండా ఏమిటో బండి సంజయ్ స్పష్టంగానే చెప్పేశారు. మరి తెలంగాణలో లాగా..ఏపీలోనూ బిజెపి ట్రాప్ లో ఓటర్లు పడతారా?.


అసలు ఏపీలో బిజెపి అంటే ప్రజలు రకరకాల కారణాలతో కసితోఉన్నారు. మరి అవన్నీ మర్చిపోయి మతం ఆధారంగా ఓట్ల చీలిక వస్తుందా?. బిజెపి ప్రయోగం ఫలిస్తుందా?. అటు చంద్రబాబు జమానాలోనూ..ఇటు జగన్ పాలనలోనూ కేంద్రంలోని బిజెపి సర్కారు ఏపీకి చట్టబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, మేజర్ పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ వంటి ఎన్నో అంశాల్లో హ్యాండ్ ఇచ్చింది. అయినా సరే అటు జగన్ కానీ..ఇటు చంద్రబాబు కానీ బిజెపిపై..మోడీ సర్కారును నిలదీసే పరిస్థితి లేదు . మరి ఇన్ని వైఫల్యాలు పెట్టుకుని బిజెపి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఢీకొట్టకలదా?. ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it