Telugu Gateway
Telugugateway Exclusives

కెసిఆర్ కోసం ఉండవల్లి..సజ్జల మాట్లాడారా?!

కెసిఆర్ కోసం ఉండవల్లి..సజ్జల మాట్లాడారా?!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో కెసిఆర్ తో సమావేశం అయి అయన పెట్టబోయే బిఆర్ఎస్ పై చర్చలు సాగించిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత కెసిఆర్ కి స్పష్టమైన విజన్ ఉందని పొగడ్తలు కురిపించారు ఉండవల్లి. ఇది అంతా పాత విషయం. సడన్ గా ఉండవల్లి బుధవారం మీడియా సమావేశం పెట్టి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు..ఇందులో ప్రధానమైనది సుప్రీమ్ కోర్టులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదించిన లాయర్ అభిషేక్ సింఘ్వీ విభజనకు తాము వ్యతిరేకం కాదని...ఈ కేసు గురించి వదిలేయాలని చెప్పారన్నారు. అయితే ఇది సుప్రీమ్ కోర్ట్ లో ఎప్పుడు జరిగింది అంటే వారం..పది రోజుల క్రితం చోటుచేసుకుంది. మరి ఇంతటి కీలక విషయం పై ఉండవల్లి అరుణ్ కుమార్ వెంటనే కాకుండా...ఇంత తాపీగా ఎందుకు మాట్లాడారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఉండవల్లి మాట్లాడిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కీలక సలహాదారు సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖలు చేశారు. తాము రెండు రాష్ట్రాలు కలిసిపోయిన ఒకే..లేకపోతే అన్యాయం సరి చేయాలి అంటూ మాట్లాడారు. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ పై చాలా సార్లు విమర్శలు చేశారు. జగన్ పాలనా కూడా వ్యాపారంలాగా చేస్తున్నారని..అయన ఆలోచన అంతా అలాగే ఉంది అంటూ మాట్లాడిన సందర్బాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఉండవల్లి విమర్శలపై వైసీపీ ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవు. రెండు రాష్ట్రాలు కలిస్తే స్వాగతించే వాళ్లలో తాము ముందు ఉంటామని..వైసీపీ, జగన్ విధానం కూడా అదే అంటూ సజ్జల తెలిపారు. అటు ఉండవల్లి వ్యాఖలు....ఇటు సజ్జల రియాక్షన్ చూస్తే ఇది అంతా కెసిఆర్ కు మేలు చేసి మరో సారి సెంటి మెంట్ రెచ్చగొట్టే ప్రయత్నంలాగా ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సుప్రీమ్ కోర్ట్ లో ఉన్న కేసు సంగతి కాసేపు పక్కన పెడితే ఒకే వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రతినెలా జీతాలు కూడా ఇవ్వటానికి నానా తంటాలు పడుతోంది. అయినా సరే విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన పలు సంస్థల్లో నగదు విషయంలో కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అసలు సీరియస్ గా తీసుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతే కాదు మరో ఏడాదిన్నరలో ఉమ్మడి రాజధాని కూడా పోతుంది. అప్పటికి పంపకాలు పూర్తి కాకపోతే ఇక అంతే. ఈ విషయాలు ఏమి కూడా ఇప్పటివరకు సీరియస్ గా పట్టించుకోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా రెండు రాష్ట్రాలు కలిస్తే బెటర్ అనటం అంటే ఇది పక్కాగా పొలిటికల్ గేమ్ ప్లాన్ అని చెపుతున్నారు. మరో వైపు సజ్జల ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇది సాధ్యం కాదు అంటూనే తాము దాని కోసమే ఉన్నామని చెప్పటం అంటే అటు ఉండవల్లి, ఇటు సజ్జల పక్క ప్లాన్ ప్రకారం టి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కు మేలు చేసేలా అంతా డిజైన్ చేసినట్లు ఉందని ఒక కీలక నేత అభిప్రాయపడ్డారు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి వై ఎస్ షర్మిల పార్టీ పెట్టిన అంశంపై స్పందిస్తూ జగన్ కానీ, తాము కానీ స్పష్టమైన ఆలోచనతో..విధానంతో అక్కడ పార్టీ ఉండొద్దు అని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎందుకు అంటే ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేసుకోవాలనే ఈ నిర్ణయం అని చెప్పారు. ఇప్పుడు మాత్రం వైసీపీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కోసం ఉందని..టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ లు మాత్రం విభజనకు మద్దతు ఇచ్చారు అంటున్నారు.

సజ్జల కామెంట్స్

సుప్రీమ్ కోర్ట్ లో ఉన్న విభజన పిటిషన్ ఆధారంగా తిరిగి రెండు రాష్ట్రాలు కలిపి ఉంచాలనే పరిస్ధితి వస్తే దాన్ని వైసీపీ స్వాగతిస్తుంది. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వినిపిస్తాం. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలి.. లేదా సరిదిద్దాలని కోరతామన్నారు. విభజన జరిగిన తీరుపైనే కేసు వేశారని, హామీల అమలు కోసం కాదని.. విభజన హామీల అమలు కోసం ఏపీ ప్రభుత్వం పోరాడుతోందని సజ్జల తెలిపారు . రెండు రాష్ట్రాలు కలిసే అవకాశాన్నీ ఏపీ సర్కార్ ఉపయోగించుకుంటుందని, ఇరు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సిందేముందన్నారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని విమర్శించారు. రెండు రాష్ట్రాలు కలిసేదాని కోసం వైసీపీ పోరాడుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Next Story
Share it