Telugu Gateway
Telugugateway Exclusives

‘సిట్ ’ నోటీసులు సెలెక్టెడ్ నేతలకేనా?!

‘సిట్ ’  నోటీసులు సెలెక్టెడ్ నేతలకేనా?!
X

కవిత, హరీష్, కెటిఆర్ పాత్ర ఉందని ఆరోపణ

అయినా ఇప్పటికి నోటీసు లు ఇవ్వని సిట్ !

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ల అంశం తెలంగాణలో ఇప్పుడు ఒక ప్రధాన ఇష్యూ గా మారింది. ఎందుకంటే ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు సంబదించిన అంశం కావటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల ఏడాది కావటంతో అదే సమయంలో సర్కారును ఇరకాటంలోకి పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి కౌంటర్ గా సర్కారు సిట్ తో నోటీసు లు ఇప్పిస్తోంది ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ కు కూడా నోటీసు లు జారీచేసింది. రేవంత్ రెడ్డి గురువారం సిట్ ముందు హాజరు కూడా అయ్యారు. సిట్ ఆధారాలు ఇవ్వమని అడుగుతుంటే...ఇది రాజకీయ వేధింపులు అని పార్టీలు విమర్శిస్తున్నాయి. కాసేపు ఈ సంగతి కాసేపు పక్కన పెడితే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ల విషయం లో మొడటి సారి ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్యామిలి పై ఆరోపణలు చేసింది ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. మాజీ ఐ పీఎస్ అధికారి అయిన అయన కెసిఆర్ ఫ్యామిలి పై డైరెక్ట్ ఎటాక్ చేశారు. కానీ ఇప్పటివరకు సిట్ ఆయనకు మాత్రం ఎలాంటి నోటీసు జారీచేయక పోవటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అయన మాజీ పోలీస్ అధికారి అన్న భయమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. పేపర్ లీక్ పై ప్రవీణ్ కుమార్ మాటలు ఇలా ఉన్నాయి.

‘ముఖ్యమంత్రి ఏజెంట్లు రహస్య సెక్షన్ లో ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. అందులో నుంచే కవితకు, హరీష్ రావు కు పేపర్ లు పోయాయి. గ్రూప్ వన్ పేపర్ లు.ఈ ఆధారాలు నేను సిట్ కు ఇవ్వను. హై కోర్ట్ జడ్జి కానీ, సిబిఐ కానీ విచారణ జరిపినప్పుడే ఆ ఆధారాలు నేను ఇస్తా.ఇది ఒక్క రోజులో జరుగుతున్నది కాదు. గత, మూడు నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నది. 2016 సంవత్సరంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షలో కూడా నలుగురు వ్యక్తులు టాపర్లుగా వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడా పెద్దగా ప్రిపేర్ కాలేదు. అందులో ఒక వ్యక్తి టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి అని చెపుతున్నారు. కవిత మనుషులు 23 మంది ఒకటే సెంటర్ లో ఉన్నారు. వాళ్ళ అందరికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. దీని మీద ఒక్కరు కూడా విచారణ చేయలేదు. దీంట్లో దగా పడ్డ నిరుద్యోగులు హై కోర్ట్ లో కేసు వేస్తే ఇప్పటివరకు కూడా అది బెంచ్ మీదకు రాలేదు. ప్రభుత్వం ఇంటరెస్ట్ తీసుకోవటం లేదు. మరి ఎట్లా వస్తది. ఏ విధంగా ఈ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. కవిత పాత్ర కానీ..హరీష్ పాత్ర కానీ..లేకపోతే కెటిఆర్ పాత్ర కానీ ..అసలు వీళ్లకు టీఎస్‌పీఎస్సీ తో ఏమి పని ఉంది. అది ఒక రాజ్యాంగబద్ద సంస్థ. కానీ అందులో పని చేసే ఉద్యోగులను వీళ్లు గుప్పిటలో పెట్టుకుని ఇది చేస్తున్నారు అనేది ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు.

నేను కూడా తెలంగాణ పోలీస్ లో పనిచేసిన.సిట్ ఎన్ని రిపోర్టులు చేసినా వాళ్ళు డీజీపీ కి ఇస్తారు. చీఫ్ సెక్రటరీ కి ఇస్తారు. వీళ్లిద్దరు పోయి సీఎం కు ఇస్తరు. చీఫ్ మినిస్టర్ వాళ్ళ కుటుంబమే ఇన్ వాల్వ్ అయినప్పుడు ..సీఎం ద్వారా తెలంగాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం నాకు లేదు. ’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు సీఎం కెసిఆర్ ను ను అడుగుతున్నా. మా లాంటి వాళ్ళ ఫోన్లు హ్యాక్ చేయటం వస్తుంది. మా లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం వస్తది. మా సిడీఆర్ లు తీసుకుని అనలైజ్ చేయటం వస్తది. కానీ మీ కనుసన్నల్లో పనిచేసే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ..చైర్మన్ తో సహా ఆ ఉద్యోగుల ఫోన్ కాల్స్ ఎందుకు మీరు మానిటర్ చేయలేదు అంటూ ప్రశ్నించారు. దీంతో పాటు అయన తాజాగా అంటే గురువారం నాడు కూడా ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ జాగృతి మెదక్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తనోబా గారు ఎవరి దగ్గర పనిచేసిండ్రో చూడండి! ఈమె ఇప్పుడు ⁦@ట్సప్స్కోఫిషల్ ⁩ మెంబరు! #LiquorScam లాగా ఎన్ని పోస్టులు ఎవరెవరికి అమ్ముడు పోయినయో?? అంటూ ఆమె కవిత తో ఉన్న ఫోటోను జత చేశారు.

Next Story
Share it