టాలీవుడ్ కు ప్రేక్షకులు చూపిస్తున్న 'సినిమా ఇది'
ఇప్పుడు నాగచైతన్య, రాశీ ఖన్నా జంటగా నటించిన థాంక్యూ సినిమాదీ అదే పరిస్థితి. ఈ సినిమా టిక్కెట్ ధరను 200 రూపాయలుగా నిర్ణయించారు. అయినా సరే మల్టీప్లెక్స్ ల్లో వీక్ ఓపెనింగ్సే ఉన్నాయి. తాజాగా నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అన్ని సినిమాలకు మల్టీప్లెక్స్ ల్లో జీఎస్టీతో కలిపి 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలుగా నిర్ణయించాలని ప్రతిపాదించామన్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ధరల పెంపు ఉంటుందని సంకేతం ఇచ్చారు. మరి ప్రేక్ష కులు కూడా భారీ బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలే చూసుకుందాం అనుకుంటే చిన్న హీరోలు..చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటి అన్న చర్చ మొదలైంది. మన మార్కెట్ కు సింగిల్ స్క్రీన్స్ లో ఒక టిక్కెట్ ధర 150 రూపాయలు కూడా చాలా ఎక్కవ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి టాలీవుడ్ పెద్దలు అందరూ కలసి టిక్కెట్ రేట్లను అడ్డగోలుగా పెంచేసి మొత్తం పరిశ్రమనే సమస్యల్లోకి నెట్టారని కొంత మంది నిర్మాతలు మండిపడుతున్నారు. గత కొంత కాలంగా పెరిగిన టిక్కెట్ రేట్ల దెబ్బకు చాలా మంది సినిమా అభిమానులు కూడా థియేటర్ల వైపు చూడటం బాగా తగ్గించుకున్నారు.