Telugu Gateway
Telugugateway Exclusives

తెలంగాణ లో ప్రమాదకరస్వామ్యం!

తెలంగాణ లో ప్రమాదకరస్వామ్యం!
X

ప్రభుత్వాలు ఇలా కూడా ఉంటాయా?. ఒక జాతీయ వేడుక అయిన రిపబ్లిక్ డే విషయం లో ఇంత దారుణంగా వ్యవహరించటమే కాకుండా ..దాన్ని సమర్ధించుకుంటున్న తీరు ఐఏఎస్ అధికారులనూ కూడా విస్మయానికి..షాక్ కు గురిచేస్తోంది. తాము ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేశామని...ఎంతో మందిని ముఖ్యమంత్రులను చూశామని కానీ ..ఇలా ఎవరు చేయలేదని చెపుతున్నారు ఐఏఎస్ లు. ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో కూడా ప్రభుత్వం చాలా సార్లు ఇలాగే చేసింది అంటూ వాళ్ళు ఆర్ టి సి సమ్మెను కూడా ఉదాహరణగా చూపుతున్నారు. కెసిఆర్ తోలి టర్మ్ లో ఆర్ టి సి ఉద్యోగులు తమ హక్కుల కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా హై కోర్ట్ మానవత్వంతో ఆర్ టి సి కార్మికుల విషయంలో వ్యవహరించాలని సూచించింది. అదే సమయంలో ఉప ఎన్నిక వస్తే ఒక నియోజకవర్గానికి వందల కోట్ల హామీలు ఇస్తున్నారు గా...కార్మికుల కోసం ఇలా చేయలేరా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయినా సరే సీఎం కెసిఆర్ అప్పటిలో డోంట్ కేర్ అన్నారు. అటు కార్మికులు..ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాత కెసిఆర్ వాళ్ళ హామీలు కొన్ని తీర్చి..వాళ్ళతో ప్రగతి భవన్ లో కలిసి భోజనాలు చేశారు..తర్వాత సీఎం కు పాలాభిషేకాలు చేశారు. అప్పుడు కూడా కోర్ట్ చెపితే మేము ఎందుకు చేయాలి అన్న చందంగా వ్యవహరించిన కెసిఆర్..తర్వాత తాను అనుకున్నట్లు చేసి చప్పట్లు కొట్టించుకున్నారని ఒక అధికారి పాత విషయాలను గుర్తు చేశారు. ఆయనే ఇప్పుడు తెలంగాణలో ప్రజాస్వామం కాదు ...ప్రమాదకర స్వామ్యం ఉందని సంచలన వ్యాఖలు చేశారు. బిఆర్ఎస్ అధికారంలో ఉండి తాను ఉద్యమాలు చేయాలంటే జాతీయ రహదారులపై కూడా చేస్తుంది. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఓకే. అదే ప్రతిపక్షాలు ధర్నా చౌక్ లో కార్యక్రమం పెట్టుకోవాలన్నా ఏదో ఒక కారణం చెప్పి తిరస్కరిస్తారు.

చివరకు కోర్ట్ కి వెళ్లి అనుమతి తెచ్చుకుంటే కానీ ధర్నాలు కూడా చేయలేని పరిస్థితి. వరసగా రెండు సార్లు అధికారంలోకి రావటం..రాష్ట్రంలోని ఇతర పార్టీలను ఫిరాయింపులుతో పాటు రకరకాల మార్గాల్లో దెబ్బతీయటంతో అధికార పార్టీ ఇష్ఠారాజ్యం అయింది అనే అభిప్రాయం ఉంది. తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న కోర్ట్ ధిక్కార కేసు లు కూడా చాలా ఉన్నయాని..ఇది అంతా ప్రభుత్వ ఆటిట్యూడ్ ను తెలియచేస్తోంది అని వ్యాఖ్యనిస్తున్నారు. అపరిమిత అధికారాలు మాకు ఉన్నాయి కాబట్టి మేము ఏమి చేసిన ఒకే అన్న చందంగా పరిస్థితి తయారు అయిందని..నిన్న మొన్నటి వరకు సిఎస్ గా కొనసాగిన సోమేశ్ కుమార్ కూడా అచ్చం అలాగే వ్యవహరించారు అని చెప్పారు. చివరకు ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను , ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రధాన పార్టీల ఉనికిని..వాళ్ళ మాటలను ఈ మాత్రం కేర్ చేయని వాళ్ళు ఇక ప్రజలను...వాళ్ళకు ఏమైనా సమస్యలు వస్తే పట్టించుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిపబ్లిక్ డే విషయం లో హై కోర్ట్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతీయ పండగను ఎప్పటిలాగానే పెరేడ్ తో పాటు ప్రజలకు అనుమతిచ్చాలి అని ఆదేశించింది. అది జాతీయ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం అంటే అందులో విధిగా ముఖ్యమంత్రి పాల్గొనాలి. పైగా అది చేసేది ప్రభుత్వమే. కానీ ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు మాత్రమే హాజరు అయినా విషయం తెలిసిందే. ఇది అత్యంత ప్రమాదకర ధోరణికి సంకేతాలుగా ఒక సీనియర్ ఐఏఎస్ అభివర్ణించారు.

Next Story
Share it