Telugu Gateway
Telugugateway Exclusives

కొత్త సచివాలయానికి అయినా సీఎం కెసిఆర్ వస్తారా?!

కొత్త సచివాలయానికి అయినా సీఎం కెసిఆర్ వస్తారా?!
X

తెలంగాణ కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంత్రి తర్వాత ఎప్పుడైనా ఇది ప్రారంభించవచ్చు. దీంతో ఇటు ఐఏఎస్ అధికారాలతో పాటు ఉద్యోగుల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కొత్త సచివాలయానికికి అయినా సీఎం కెసిఆర్ వస్తారా..రారా అన్న అంశం ఇప్పుడు ఉద్యోగుల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఎందుకు అంటే కొద్దీ నెలల్లోనే నూతన సౌకర్యం అందుబాటులోకి రానుంది. వాస్తవానికి పాత సెక్రటేరియట్ మరో 50 సంవత్సరాలు నడిచే అవకాశం ఉన్నా కూడా అక్కడ భయంకరమైన వాస్తు దోషాలు, పార్కింగ్ సదుపాయాలు లేవు అంటూ అప్పట్లో సీఎం కెసిఆర్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అటు ఉద్యోగులు..ఇటు ప్రజలు ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే అన్నీ వదిలేసి కెసిఆర్ కొత్త సెక్రటేరియట్ కట్టాలని నిర్ణయించటాన్ని తప్పు పట్టారు.ఇది అంత గతం. కొత్త సెక్రటేరియట్ ఇప్పుడు తుది దశకు చేరింది. తొలుత అంచనా వేసిన దాని కంటే ఖర్చు కూడా వందల కోట్లు పెరిగింది. ఇది పూర్తి అయి అందుబాటులోకి వచ్చేది 2023 లోనే.

వచ్చే ఏడాది చివరిలోనే ఈ ప్రభుత్వ కాలపరిమితి ముగియనుంది. మరి ఈ సమయం లో సీఎం కెసిఆర్ తాను కోరుకున్నట్లు వందలకోట్లు వెచ్చించి కట్టించిన సచివాలయానికి అయినా వస్తారా లేక ఎప్పటిలాగానే ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ ల నుంచే పాలనా సాగిస్తారా అన్నది ఆసక్తి కరంగా మారింది. అయితే కొత్త సచివాలయం కట్టిన సీఎం కెసిఆర్ ఇతర సీఎం ల తరహాలో రోజూ సెక్రటేరియట్ కి వచ్చే ఛాన్స్ ఉండదని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కొత్త సచివాలయం ఎంత లేదన్నా వందేళ్లు ఉంటుంది. అన్ని సంత్సరాలపాటు ఇది కెసిఆర్ కట్టించిన సచివాలయం అని చెప్పకతప్పదు. అదే సమయంలో చరిత్రలో తన పేరు నిలిచిపోయాలా చేసుకోవటం కోసమే ఇది అంతా చేస్తున్నారు అని ఒక కీలక నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ నూతన సచివాలయం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలోగా దీని వ్యయం వెయ్యి కోట్లకు చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని హంగులోతే కొత్త సచివాలయం కట్టిన తర్వాత కూడా సీఎం కెసిఆర్ ఇక్కడకు రాకపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. అయితే ఇలాంటి వాటిని కెసిఆర్ అసలు పట్టించుకోరు అని చెపుతున్నారు.

Next Story
Share it