వేల కోట్ల రూపాయల స్కామ్ లు చేసి 'జర్నలిజం పాఠాలు'
చేతిలో ఛానల్ ఉంటే ఎవడి మీద అయినా బురద చల్లొచ్చా?. మన అక్రమాలు వెలికితీసిన వాడి మీద 'కూలీల'ను పెట్టి బురదచల్లించొచ్చా? నా మీద మర్డర్ కేసులు ఏమీ లేవు. అలాగే భూ కబ్జా కేసులు కూడా ఏమీ లేవు. అలాగే ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులూ లేవు. నేను చేసేది కేవలం నాకు తెలిసిన వార్తలు రాయటమే. ప్రతి రోజూ ఇలా నేను నా వెబ్ సైట్ ద్వారా రాసే వార్తల కింద బూతులు తిటిస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడితే భయపడి పారిపోతాననుకుంటున్నావేమో . నువ్వు ఎన్ని బూతులు తిట్టించినా ఓకే. నా గురించి తెలిసిన వాళ్ళకూ నేనేంటో తెలుసు. నా గురించి ఏమీ తెలియని వారికి అసలు ఏమీ చెప్పాల్సిన పని లేదు. ఒకటి మాత్రం నిజం. నీ లాంటి వాళ్లతో జర్నలిజం పాఠాలు చెప్పించుకోవాల్సిన దుస్థితిలో నేను లేను.
ఈ బూతుల, బెదిరింపుల దాడిపై ఇప్పటికే ఓ సారి సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. అసలు నీ ఛానల్ మొదలైందే అర్ధరాత్రి కథలతో. ఆ విషయం జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. నన్ను తిట్టడానికి రెండు రోజులుకో కొత్త కూలీని వెతుకుతూ ..కొత్త కొత్త వారితో తిట్టిస్తున్నావ్. ప్రతిది రికార్డు అవుతుంది. నేను తప్పు చేసినట్లు ఆధారాలుంటే ఎవరైనా కేసు పెట్టుకోవచ్చు. అది కోర్టులోనే తేలుతుంది. ఇక చేతిలో ఛానల్ ఉంది కదా అని..క్యారెక్టర్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నావ్. ఎంత కాలం చేస్తావో చేసుకో. నీ లాంటి స్కామ్ స్టర్లకు భయపడాల్సిన అవసరం లేదు. నీ బూతుల దాడి ఎంత కాలం సాగినా ఓకే. చివరకు ఎంతకు దిగజారారు అంటే ఇలా తిట్టడానికి కూడా కొంత మంది వ్యక్తులను జీతాలు ఇచ్చి మరీ పెట్టుకున్నారు. అన్ని ఆధారాలతో మరోసారి ఫిర్యాదు చేస్తా.