సీఎం జగన్ మాటలు చూసి సాక్షి కూడా సిగ్గుపడిందా?!
ఇక్కడ అసలు విచిత్రం ఏమిటంటే సీఎం జగన్ ఎవరిని అయితే తిట్టారో ఆ పత్రికలే జగన్ వ్యాఖ్యలను బ్యానర్లుగా ప్రచురించాయి. ఇందులో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుని ఉంటారనటంలో సందేహం లేదు. జగన్ అన్న మాటలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలన్నది వాటి ఉద్దేశం కావొచ్చు. సహజంగా సీఎం జగన్ లేదా వైసీపీ నేతలు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలపై, ప్రత్యర్ధి మీడియాపై విరుచుకుపడితే సాక్షి ప్రముఖంగా ఫస్ట్ పేజీలో ప్రచురిస్తుంది. కానీ అందుకు భిన్నంగా సాక్షి నంద్యాల సమావేశం కవరేజ్ ఇచ్చింది. అది కూడా ముఖ్యంగా ఈ పరుష వ్యాఖ్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ పత్రిక చూసిన వారెవరికైనా తెలుస్తుంది. సాక్షి కూడా పీకుడు భాషను హెడ్డింగ్ లో పెడితే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని భావించే ఇలా చేసినట్లు కన్పిస్తోంది.