Telugu Gateway
Telugugateway Exclusives

కెసిఆర్ ముందస్తు ప్లాన్స్ కే బడ్జెట్ పై హైరానా!

కెసిఆర్ ముందస్తు ప్లాన్స్ కే బడ్జెట్ పై హైరానా!
X

మార్చి వరకు సమయం ఉన్నా ఎందుకు ఈ హడావుడి

బడ్జెట్ తర్వాత అసెంబ్లీ రద్దుకు నిర్ణయం..కెసిఆర్ దూకుడు వెనక కారణం అదే!

తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సోమవారం ఉదయం వరకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపలేదు. దీనిపై తెలంగాణ సర్కారు సోమవారమే నాడు హై కోర్ట్ ని ఆశ్రయించింది. అక్కడ ఒక పరిష్కారం దొరికింది. బడ్జెట్ సమావేశాల్లో ఈ సారి గవర్నర్ ప్రసంగం ఉంటుంది...గవర్నర్ కూడా తన రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తిస్తారు అని ఒక ఫార్ములా తో ఈ సమస్య క్లోజ్ అయింది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్ ఆమోదం పొందటానికి మార్చ్ 31 వరకు సమయం ఉంది. ఎలాగూ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ ఇచ్చినందున సమావేశాలు పెట్టి అటు గవర్నర్ తీరు..ఇటు కేంద్రం తీరుపై విమర్శలు చేసే అవకాశం ఉంది . కానీ బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ అలా కాకుండా వెంటనే బడ్జెట్ పెట్టాలనే పట్టుదలతో ఎందుకు ఉన్నారు అంటే దీనికి బలమైన కారణాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. అదేంటి అంటే వెంటనే తాము అనుకున్నట్లు బడ్జెట్ పెట్టి..ఆమోదం పొంది..ఆ తర్వాత అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉంది అని చెపుతున్నారు.

బడ్జెట్ ఆమోదానికి సాంకేతికంగా చూస్తే ఇంకా చాలా సమయం ఉంది. అయినా కూడా ఇంత ఆగమేఘాల మీద కేంద్రం పెట్టిన వెంటనే పెట్టి ఆమోదించాల్సిన అవసరం ఏముంది అంటే...కారణం ముందస్తు ఎన్నికలు అనే చర్చ సాగుతోంది. అయితే ఒక వేళ కెసిఆర్ అసెంబ్లీ రద్దు చేసినా దానికి మళ్ళీ గవర్నర్ ఆమోదం లభిస్తుందా...కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న తరహాలలో వెంటనే ఎన్నికలు నిర్వహిస్తుందా అన్న అనుమానాలు లేక పోలేదు. కానీ సీఎం కెసిఆర్ కేవలం కేంద్రం, అటు మోడీ తీరుపై ఎటాక్ చేసేందుకే డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నట్లు లీకులు ఇచ్చారు. కానీ అదేమీ వాస్తవ రూపం దాల్చలేదు. బడ్జెట్ విషయంలో కెసిఆర్ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే మాత్రం పరిణామాలు ముందస్తు దిశగానే సాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో కెసిఆర్ అసెంబ్లీ రద్దు చేసినా..వెంటనే ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీ, బిఆర్ ఎస్ కలిసి ఉన్నాయనే ప్రచారానికి బలం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా రాజకీయంగా కెసిఆర్ కు కొంత ఇబ్బంది కలిగించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బడ్జెట్ ఆమోదం తర్వాత కానీ అసలు విషయం ఏమిటో తెలియదు.



Next Story
Share it