మంగళగిరిలో గెలవని లోకేష్....పాదయాత్రతో ఏపీలో టీడీపీని గెలిపిస్తారా?!
వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ గెలిస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు కి వెళ్తుందా...లేక నారా లోకేష్ కి వెళుతుందా అన్న సందేహాన్ని ఒక కీలక నేత వ్యక్తం చేశారు. మరో నాయకుడు అదేమీ కాదని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆ క్రెడిట్ అంతా వైసీపీ అధినేత జగన్ కె దక్కుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీకి పడే ఓట్లు పార్టీ పై ప్రేమతో కంటే జగన్ పాలన పై వ్యతిరేకత తోనే ఎక్కువ ఉంటాయని అన్నారు. ఈ విషయం గుర్తించకుండా తాము లేకపోతే ఇక ఆంధ్ర ప్రదేశ్ కి భవిష్యత్ ఉండదు అనే తరహాలో మాట్లాడుతున్నారు అని కొంత మంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి కొంత అనుకూలంగా మారుతున్న పరిస్థితులను ఇలాంటి కామెంట్స్ తో చెడగొడుతున్నారు అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. వచ్చే ఎన్నికలకు నారా లోకేష్ ను ముందు పెట్టి నడిపిస్తే ఇబ్బంది అని పార్టీ లో కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. ఆ తరుణంలో ఈ సారికూడా ఎన్నికలను లీడ్ చేసేది చంద్రబాబే అని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు సభలు సూపర్ సక్సెస్ అవుతున్న తరుణంలో లోకేష్ పాదయాత్ర ప్రభావం ఎలా ఉంటది. ఇంత కాలం జగన్ వెర్సస్ చంద్రబాబు అంటూ సాగిన ప్రచారం జగన్ వర్సెస్ నారా లోకేష్ గా మారితే పరిస్థితి ఏంటి..అదే సమయంలో మంగళగిరిలో సొంతంగా గెలవలేని లోకేష్...రాష్ట్రము అంతా తిరిగి టీడీపీని గెలిపిస్తాడా వంటి విమర్శలు వస్తాయని..వీటిని పేస్ చేయటం..సమాధానం చెప్పటం అంతా ఈజీ కాదని చెపుతున్నారు. ఇప్పుడు ఒకింత అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉన్న టీడీపీని లోకేష్ పాదయాత్ర ఎటు తీసుకెళుతుందో అన్న అనుమానాలు కూడా కొంత మంది నేతల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళు దీనిపై మాట్లాడే పరిస్థితిలో లేరు.