Telugu Gateway
Telugugateway Exclusives

తెలంగాణ ఇక పొలిటికల్ ఫీల్డ్ ఫర్ అల్

తెలంగాణ ఇక పొలిటికల్ ఫీల్డ్ ఫర్ అల్
X

'ప్రత్యేక హోదా' కోల్పోయిన తెలంగాణ రాజకీయ క్షేత్రం !

ఒక్క పేరు మార్పుతో తెలంగాణ రాజకీయ క్షేత్రం లో కీలక మార్పులు రాబోతున్నాయి. నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ గులాములు, బీజేపీ నాయకులను గుజరాతి గులాములు అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు విమర్శించేవారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తో పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్ ఎస్). దీన్ని కెసిఆర్ ముందు ఉండి నడిపించారు..ఇందులో ఎంతో మంది సహకరించారు. ఇది అంతా గత చరిత్ర. ఆ పార్టీ పేరులోనే తెలంగాణ ఉండటంతో ప్రజలు కూడా ఆ పార్టీకి బాగా కనెక్ట్ అయ్యారు. నిజానికి ఏ పార్టీ అయినా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పోటీచేయవచ్చు. ప్రజలు మద్దతు ఇస్తారా లేదా అన్నదే కీలకం. ఇప్పటివరకు కెసిఆర్ విజయవంతంగా సెంటిమెంట్ ను రాజేస్తూ పెద్ద ఎత్తున రాజకీయ లబ్ది పొందారు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవటం ఆయనకు బాగా కలసి వచ్చింది. ఇప్పుడు టిఆర్ఎస్ కాస్తా భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ )గా మారింది. ఇప్పుడు కెసిఆర్ పలు రాష్ట్రాల్లో పోటీకి సన్నాహాలు చేస్తున్నారు. తొలివిడత కర్ణాటక ఎన్నికల్లో నిలవబోతున్నట్లు ప్రకటించారు కూడా.

ఎంతో సెంటిమెంట్ తో కూడిన తెలంగాణ పేరునే పార్టీ నుంచి దేశం లోని పలు రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పోటీ చేయటానికి రెడీ కావటం తో ...ఇక తెలంగాణ రాజకీయ క్షేత్రం ఓపెన్ ఫర్ అల్ అన్నట్లు అయింది. గతంలోనూ ఈ ఛాన్స్ ఉన్నా స్వయంపాలన అన్న సెంటిమెంట్ ను వాడితో ఇతరులకు ఛాన్స్ లేకుండా చేస్తూ వచ్చింది టిఆర్ఎస్. ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బిఆర్ఎస్ దేశ వ్యాప్తంగా పోటీచేస్తూ మీరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అనే ఛాన్స్ మిస్ అవుతారు. ఇక ఇంత కాలం చేసినట్లు ఆంధ్ర పార్టీలు...ఢిల్లీ పార్టీలు,,గుజరాత్ పార్టీలు అనటానికి ఉండదు. ఒక వేళ ఎవరైనా ఆలా అన్న అది బిఆర్ఎస్ పార్టీ కి కూడా అంతే ఇబ్బందికరంగా మారటం ఖాయం. ఏ సెంటిమెంట్ పేరుతో రాజకీయంగా కెసిఆర్ లబ్ది పొందారో..ఇప్పుడు అయన దాన్ని వదిలేశారు. మరి రాబోయే రోజుల్లో దీన్ని ప్రభావం ఎలా ఉంటదో చూడాలి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ సీఎం కెసిఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నా ప్రస్తుతానికి ఆయనతో కలిసివచ్చే వారు పెద్దగా ఎవరు కనిపించటంలేదు..ఒక్క కుమార స్వామి తప్ప. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కెసిఆర్ దేశ రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారో భవిష్యత్తులో కానీ తేలదు.

Next Story
Share it