Telugu Gateway
Telugugateway Exclusives

ఈ సారి కొత్త ఏడాది జోష్ కూడా మిస్

ఈ సారి కొత్త ఏడాది జోష్ కూడా మిస్
X

ఈ ఏడాది కరోనా కారణంగా ఎన్నో మిన్ అయ్యాం. ఇప్పుడు ఇది కూడా ఒకటి. కరోనా కొత్త ఏడాది జోష్ కూడా లేకుండా చేస్తోంది. కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఆ సందడే వేరు. దీనికి ఎన్ని ముందస్తు ప్రణాళికలు ఉండేవో. ఇప్పుడు ఆ ఛాన్సే లేకుండా పోయింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా..ఎవరి కంట పడకుండా ప్లాన్ చేసుకునే వాళ్లు చేసుకుంటారు. కానీ అవేవీ అధికారం కాదు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఎవరి రేంజ్ లో వాళ్ళు పార్టీలు ప్లాన్ చేసుకుంటారు. ఇక యువత అయితే చెప్పే పనిలేదు. డిసెంబర్ 31 రాత్రి దేశమంతా మద్యం కూడా ఏరులై పారుతోంది. కానీ ఈ సారి పార్టీలు..బహిరంగ ఉత్సవాలకు ఛాన్స్ లేదు.. ఏపీ సర్కారు ఇప్పటికే దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది. తెలంగాణ సర్కారు అధికారికంగా ఏమీ చెప్పకపోయినా హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రమంతటా కూడా ఉత్సవాలపై ఆంక్షలు విధించటం ఖాయం. స్టార్ హోటళ్ళు మొదలుకుని ప్రతి చోటా ప్రత్యేక ఈవెంట్స్..హంగామా ఉంటుంది. కానీ ఈ సారి ఆ సీన్లు ఏమీ కన్పించవు...కన్పించబోవు. అసలు ఎవరు వస్తారో.. రారో అన్న ఆలోచనలతో ఎవరూ కూడా భారీ కార్యక్రమాలు తలపెట్టలేదు.

కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర వేడుకలపై .నిషేధం విధించాయి. కర్ణాటకలో అయితే డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకూ నిషేధం అమలు చేయనున్నారు.. అయితే పబ్ లు, క్లబ్ లు, రెస్టారెంట్స్ మాత్రం తమ సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 రాత్రి 11.30 తర్వాత బార్స్, హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్టులను ఎప్పటిలాగానే మూసి వేయించాలని నిర్ణయించారు. ఇదే బాటలో దేశంలోని రాష్ట్రాలు అన్ని పయనిస్తున్నాయి కరోనా భయంతోనే ..కేసులు పెరగుతాయనే ఉద్దేశంతో ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Next Story
Share it