Telugu Gateway
Telugugateway Exclusives

ఏపీకి కొత్త అన్న దొరికాడోచ్!

ఏపీకి కొత్త అన్న దొరికాడోచ్!
X

నిన్న మొన్న‌టివ‌ర‌కూ చంద్ర‌న్న‌. ఇప్పుడు జ‌గ‌న్ అన్న‌. వీళ్ల‌కు తోడు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు మ‌రో కొత్త అన్న దొరికాడు. ఆయ‌నే లోకేషన్న‌. అస‌లు అన్నలు మాత్రం మాయం అయ్యారు. కొత్త అన్న‌లు పుట్టుకొస్తున్నారు. ఒక‌ప్పుడు రాజ‌కీయం..పోరాటం భిన్నంగా ఉండేవి. ఇప్పుడు ఏముంది వార‌స‌త్వం ఆధారంగా వ‌చ్చిన హోదాతో నాలుగు ట్వీట్లు పెట్టి..ప‌ది జూమ్ మీటింగ్ లు పెడితే అది పోరాటం అయిపోతుంది?. ఇదేనా పోరాటం అంటే. ఎస్..ఏపీలో ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్షల ర‌ద్దు కోసం నారా లోకేష్ సీఎం జ‌గ‌న్ కు లేఖ రాశారు. విద్యార్ధుల‌తో మాట్లాడారు. క‌రోనా స‌మ‌యంలో ప‌రీక్షల వ‌ల్ల ఇబ్బందులు ప‌డ‌తార‌న్నారు. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ చివ‌ర‌కు సుప్రీంకోర్టు జోక్యంతో ఏపీ స‌ర్కారు వెన‌క్కి వెన‌క్కి వెళ్ళాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దేశంలోని రాష్ట్రాలు అన్నీ క‌రోనా కార‌ణంగా ప‌రీక్షలు ర‌ద్దు చేశాయి. చివ‌ర‌కు సీబీఎస్ఈ కూడా అదే ప‌ని చేసింది. కానీ ఏపీ స‌ర్కారు మాత్రం మొండిగా ఎవ‌రెన్ని సూచ‌న‌లు చేసినా మేం పెడ‌తామంటే పెడ‌తామంటూ వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది.

మ‌రి నిజంగా ప‌రీక్షలు పెట్టి తీరాల‌ని ఉంటే చివ‌రి నిమిషంలో ఎందుకు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు. అఫిడ‌విట్ లో కూడా ప‌రీక్షల‌కే మొగ్గుచూపారు క‌దా?. అంటే ప‌రిస్థితి చూస్తే కోర్టు ఆదేశాలు ఇచ్చాక ఆపే బ‌దులు ఆ ప‌ని ఏదో మ‌నమే చేస్తే కొంత‌లో కొంత బెట‌ర్ అన్న‌ట్లు స‌ర్కారు చివ‌రి నిమిషంలో వెన‌క్కి త‌గ్గింది. క‌థ సుఖాంతం అయింది. విద్యార్దులు సేఫ్ అయ్యారు. ఇక అప్ప‌టి నుంచి తెలుగుదేశం సోష‌ల్ మీడియా వింగ్..ఆ పార్టీ నేత‌లు చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు. చివ‌ర‌కు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా లోకేష్ రెండు నెల‌లు అలుపెర‌గ‌ని పోరాటం చేశాడ‌ని వ్యాఖ్యానించారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. చివ‌ర‌కు ఇదే అంశంలో నారా లోకేష్ కు పాలాభిషేకాలు చేసే వ‌ర‌కూ ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది చూసి టీడీపీ నాయ‌కులు కూడా అవాక్కు అవుతున్నారు. ఈ లెక్క‌న సీఎం జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాల‌ను లోకేష్ అన్న త‌న పోరాటాల‌తో అడ్డుకోలగ‌ల‌ర‌నే నిర్ణ‌యానికి తెలుగు త‌మ్ముళ్ళు వ‌చ్చినట్లు. సో ఏపీకి ఇప్పుడో మ‌రో అన్న ఆశాకిర‌ణం దొరికిన‌ట్లే క‌న్పిస్తోంది. ఇక లోకేష్ అదే చేత్తో జ‌గ‌న్ తో మూడు రాజధానుల నిర్ణ‌యాన్ని కూడా ఆపిస్తే ఆయ‌న‌కు తిరుగే ఉండ‌దు.

Next Story
Share it