Telugu Gateway
Telugugateway Exclusives

ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా..సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో?!

ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా..సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో?!
X

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల సంచలనం రేపిన అంశం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. దీని వెనక ఉన్నది అంతా బీజేపీ వాళ్లే అని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అధికార టిఆర్ఎస్ పార్టీ విశ్వసనీయత మీద ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. . ఎందుకంటే ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఐఏఎస్ సర్కిల్స్ లో కూడా తీవ్ర చర్చనీయాంశగా మారాయి. ఈ కేసు లో ఎన్నో అనుమానాలు ఉన్నాయనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతోంది. ఒక వైపు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇది చాలా పెద్ద విషయం అని చెపుతున్నారు. అటు అధికారులతో పాటు ప్రజల్లో ఉన్న కీలక ప్రశ్నలు ఇవి.

అసలు ఈ స్టింగ్ ఆపరేషన్ చేసింది టిఆర్ఎస్ పార్టీ నా ...లేక తెలంగాణ పోలీసులా?

తెలంగాణ పోలీస్ లు అయితే ఇంత పెద్ద సంచలన విషయంలో వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. వివరాలు మీడియా కు వెల్లడించలేదు?

మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో ఒక్క రూపాయి కూడా నగదు దొరకలేదు(మీడియాలో మాత్రం ముందు వందల కోట్లు అని లీకులు ఇచ్చారు..తర్వాత 15 కోట్లు అంటూ ప్రచారం చేశారు. కానీ పోలీస్ లు ఇంత వరకు ఫార్మ్ హౌస్ లో ఒక్క రూపాయి చూపించ లేదు.)

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తో డీల్ మాట్లాడటానికి వచ్చిన వారు ఏ పార్టీ వాళ్ళు అన్నది పోలీస్ లు నిర్దారించలేదు. స్వాములు కాబట్టి బీజేపీ అంటూ ప్రచారం చేశారు.

బయటకు వచ్చిన వాట్సాప్ చాట్ లో రామచంద్ర భారతి బి ఎల్ సంతోష్ కు మెసేజ్ పెడుతూ తనను తాను పరిచయం చేసుకున్నారు. అంటే బి ఎల్ సంతోష్ మెసేజ్ చూడగానే ఆయన్ను గుర్తుపట్టడన్న మాట. అలాంటి వ్యక్తికి బీజేపీ లాంటి పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు లాంటి పెద్ద బాధ్యత అప్పగిస్తుందా? అసలు అది జరిగే పనేనా?

ఆడియో క్లిప్స్ లీక్ చేశారు...వీడియోల దగ్గరకు వచ్చే వరకు స్వయంగా టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంటర్ అయ్యారు.

కోర్ట్ లో కేసు నడుస్తున్న సమయంలో ఇలా చేయటం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నది ఐఏఎస్ ల అభిప్రాయం.

ప్రెస్ మీట్ లో సీఎం కెసిఆర్ పదే పదే సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి తో పాటు దేశంలోని న్యాముర్తులు అందరికి ఈ వీడియోలు పంపిస్తానని ప్రకటించారు. చేతులు జోడించి కోరుతున్నా ఇలాంటి వాటి నుంచి కాపాడండి అంటూ వ్యాఖ్యనించారు. ఇంత పెద్ద సీనియర్ లీడర్..రెండు సార్లు సీఎం అయినా వ్యక్తికి న్యాయస్థానాలు ఎలా పని చేస్తాయో తెలియదా. ఆధారాలు ఉంటే కేసు వేయాలి..తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చూడాలి. కానీ ప్రెస్ మీట్ లో జడ్జిలు..మీడియా కి కాపీ లు పంపితే అంతా అయిపోతుందా?

ఎమ్మెల్యే లను కొనుగోలు చేయటాన్ని వచ్చిన వారు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా పైలట్ రోహిత్ రెడ్డి ని చేస్తాం. ఈవీఎం లు ఉన్నంత వరకు మాకు డోకా లేదు అని చెపుతారా?

ఫార్మ్ హౌస్ లో ఉన్న ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకే తాము అక్కడకు వెళ్లామని సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా కు చెప్పారు. తర్వాత ఎలాంటి వివరాలు చెప్పలేదు.

అక్కడే మీడియా తో మాట్లాడిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తాను ఇక్కడకు కేవలం స్నేహితుడిని కలవటానికి వచ్చానని బెదురు బెదురు గా చెప్పారు. డీల్ విషయం అడిగితే దీనిపై మాట్లాడటానికితమకు టైం కావాలని చెప్పారు. తర్వాత ఆ క్లిప్ మాయం అయింది.

ఎమ్మెల్యేల ను సీఎం కెసిఆర్ రోజుల పాటు ప్రగతి భవన్ ఉంచారు. వీళ్ళ దగ్గర పోలీస్ లు ఎందుకు స్టేట్ మెంట్ తీసుకోలేదు అన్నది అత్యంత కీలకంగా మారింది.

బాల రాజు ముందు మీడియాకు ఒకటి చెప్పారు..తర్వాత అయన ఎక్కడ ఏమి మాట్లాడలేదు. దీని వెనక కారణాలు ఏంటి...ఇలా ఈ కేసు లో లెక్క లేనన్ని అనుమానాలు ఉన్నాయని చర్చ సాగుతోంది అధికార వర్గాల్లో.

ఒక వైపు రాష్ట్రం అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణ లో ప్రవేశించటానికి వీలు లేదని జీఓ ఇచ్చిన సీఎం కెసిఆర్ మళ్ళీ ఈ ఆడియో, వీడియో లను సిబిఐ తో పాటూ అన్ని విచారణ సంస్థలకు పంపుతానని చెప్పటం డబల్ గేమ్ కదా అని అధికారులు వ్యాఖ్యనిస్తున్నారు.

డీల్ మాట్లాడానికి వెళ్లిన నలుగురి లో ముగ్గురు కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన వారే. దీంతో సీఎం కెసిఆర్ వెళ్ళాను నిప్పు కణికలు అన్నా..మరొకటి అన్నా ప్రజలు అంతగా నమ్మటం లేదు అన్న చర్చ సాగుతోంది.






Next Story
Share it