Telugu Gateway
Telugugateway Exclusives

కెసిఆర్ సర్కార్ మెట్రో మాయ!

కెసిఆర్ సర్కార్ మెట్రో మాయ!
X

టెండర్లు లేవు...ఫైనాన్సియల్ క్లోజర్ లేదు..అయినా శంఖుస్థాపన

ఏ మాత్రం లాభదాయకం కానీ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ సాధ్యమా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే..వీజీఎఫ్ లేకుండా చాలా కష్టం

వీజీఎఫ్ వచ్చినా గగ్గోలు పెడుతున్న ఎల్ అండ్ టి

హైదరాబాద్ మెట్రో దశ తొలి దశ పనులు చేపట్టిన ఎల్ అండ్ టి సంస్థ ఈ ప్రాజెక్ట్ తో భారీ నష్టాలు మూట కట్టుకుంటోంది. దీనికి కేంద్రం ఒక వైపు వీజీఎఫ్ ఇచ్చింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాంతాల్లో వాణిజ్య భవనాల నిర్మాణాలకు కూడా కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా ఈ ప్రాజెక్ట్ లాభదాయకం కాదని ఎల్ అండ్ టి గగ్గోలు పెడుతోంది. అలాంటిది ఇప్పుడు రెండవ దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతోనే చేపడతాము అని చెప్పటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వీజీఎఫ్ ఉంటేనే ఇది లాభదాయకం కాదని అలాంటిది సొంత నిధులతో అంటే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగటంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే 6250 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ (ఫైనాన్సియల్ క్లోజర్) ఇప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం అది జరిగే పని కాదని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వెల్లడించారు. ఎందుకు అంటే బ్యాంకు లు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వాలంటే ఆ ప్రాజెక్ట్ కు వచ్చే ఆదాయం, వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనే విషయం తెలిసిందే. కానీ మెట్రో రైల్ వంటి అధిక మూలధన పెట్టుబడి ప్రాజెక్ట్ పై పెట్టుబడి రికవరీ వంటి అంశాలు చాలా కష్టం అని చెపుతున్నారు. భారీ ట్రాఫిక్ ఉండే మార్గాలు ఉన్న ఎల్ అండ్ టి కూడా ప్రాజెక్ట్ నిర్వహణకు చాలా సమస్యలు ఎదురుకుంటోదని. అలాంటిది ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాం అంటే మరో గుడి బండను మెడకు తగిలించుకోవటమే అని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

దీనికి తోడు ఇప్పటికే ఆమోదం పొందిన రుణాలను కూడా ఆర్ఈసి, పీఎఫ్ సి వంటి సంస్థలు మధ్యలో ఆపేశాయి. దీనికి కారణం రాష్ట్ర బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పుల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వచ్చిన లెక్కల తేడాలే అని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంస్థ అయినా మెట్రో ప్రాజెక్ట్ వంటి ఈ మాత్రం లాభదాయకం కానీ వాటికీ అప్పు ఇస్తదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. కేంద్రం, తెలంగాణ సర్కారు మధ్య ఉన్న వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టుకు వీజీఎఫ్ రావటం కష్టమే అని చెపుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు ఫైనాన్సియల్ క్లోజర్ లేదు...టెండర్లు పిలవలేదు కానీ సీఎం కెసిఆర్ డిసెంబర్ 9 న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు అని ప్రకటించారు అంటే ఇది అంతా రాజకీయ క్రీడలో భాగమే తప్ప మరొకటి కాదు అని ఒక అధికారి వ్యాఖ్యనించారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అంశాన్ని చెప్పుకుని రాజకీయ లబ్ది పొందే ఎత్తుగడే ఇది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లేకపోతే టెండర్లు కూడా పిలవకుండా..ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉండగానే శంఖుస్థాపన ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్ట్ అంచనాలు తొలుత అది కూడా ఏడాది క్రితం 5000 కోట్ల రూపాయలు ఉండగా అది ఏకముగా 1250 కోట్లు పెరిగి 6250 కోట్ల రూపాయలకు చేరిన విషయం తెలిసిందే. ఈ మెట్రో రూట్ తో ప్రయోజనం పొందనున్న కంపెనీకే నిర్మాణ పనులు కూడా అప్పగిస్తారనే ప్రచారం అధికార వర్గాల్లో ఉంది. ఇది కూడా ఫిక్స్ అయిపోయింది అని చెపుతున్నారు. తొలి దశ ప్రాజెక్ట్ దక్కించుకోవాలని ఈ సంస్థ ప్రయత్నాలు చేసి విఫలమైంది.

Next Story
Share it