Telugu Gateway
Telugugateway Exclusives

చంపాలని చూశారన్నారు ....చంద్రబాబు సైడ్ వెళ్లారు

చంపాలని చూశారన్నారు ....చంద్రబాబు సైడ్ వెళ్లారు
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మధ్య రాజకీయ వైరం మామూలుది కాదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఏ మాత్రం పడదు. కానీ ఇద్దరూ ఇప్పుడు అన్నీ మర్చిపోయారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరుతున్నారు. నాయకులు పార్టీలు మారటం పెద్ద వింతేమీ కాదు. కానీ కన్నా లక్ష్మీనారాయణ విషయం మాత్రం అలా కాదు. ఎందుకు అంటే ఈ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు గతంలో. అవేంటి అంటే చంద్రబాబు నాయుడు ఏకంగా తనను హత్య చేయించటానికి కాంట్రాక్టు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు గతంలో. కృష్ణా జిల్లాలో రంగాను, గుంటూరు జిల్లాలో తనను ఎలిమినేట్ చేస్తే రాజకీయంగా తమకు ఇబ్బంది ఉండదు అని భావించారు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. రంగా విషయంలో సక్సెస్ అయ్యారు కానీ..తన విషయంలో మాత్రం కాలేదు అన్నారు. తర్వాత ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును గట్టిగా దొబ్బులు పెట్టారు అని కన్నా లక్ష్మీనారాయణ ఏబీఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో చెప్పటం విశేషం. అప్పటి హోమ్ మంత్రి ఇంద్ర రెడ్డి తనకు ఈ విషయం చెప్పారని తెలిపారు. ‘ జనరల్ చెక్ అప్ లో నా పై దాడికి బయలుదేరిన వాళ్ళు పట్టుబడ్డారు. ఇంటరాగేషన్ లో మాకు సో అండ్ సో కిరాయి ఇచ్చారు .

ఇస్తే మేము వెళుతున్నాం అని చెప్పారు. అప్పటి కమిషనర్ వాళ్ళను అరెస్ట్ చేసి రామారావు ను కలుద్దామని హైదరాబాద్ వచ్చారు. కమిషనర్ గన్ మెన్ కూడా నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. చీరాల లాక్ అప్ డెత్ అయితే వెళుతున్నాం పీజెఆర్,కోదండరెడ్డి మా ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ కు వచ్చారు. రొటీన్ చెక్ అప్ లో దొరికారు. అడిగితే కన్నా లక్ష్మీనారాయణ పై దాడికి చంద్రబాబు పంపిస్తున్నారు అని చెప్పారు. అప్పుడు సీఎం ఎన్టీఆర్...చంద్రబాబు రెవిన్యూ మినిస్టర్ గా ఉన్నారు. రామారావు ను దింపే ఎపిసోడ్ లో పీజీఆర్ కొంత చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంద్రా రెడ్డి హోమ్ మంత్రి గా నా దగ్గరకు వచ్చి కూర్చుని నిన్ను,, రంగాను చంపటానికి ప్రయత్నం చేశారు. విషయం తెలిసి ఎన్టీఆర్ చంద్రబాబు పై మండిపడ్డారు. ఆయనలో ఎప్పుడూ ఇంత కోపం చూడలేదు. ఎన్టీఆర్ క్యారెక్టర్ అది...ఇతని క్యారక్టర్ ఇది అని చెప్పారు. మరి మీ లీడర్ ఏమో అతనికి సపోర్ట్ చేస్తున్నాడు. హోమ్ మంత్రి గా అయన నాకు ఈ మర్డర్ ప్లాన్ నిర్దారణ చేశారు. ’ అంటూ కన్నా తెలిపారు. ఇది ఒక్కటే కాదు చంద్రబాబు పై కన్నా లక్ష్మీనారాయణ చేసినన్ని విమర్శలు బహుశా రాష్ట్రంలో మరో నేత ఎవరు చేసి ఉండరేమో. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ ఒక్కటి అవుతున్నారు.

Next Story
Share it