జస్టిస్ పీసి ఘోష్ కు అంత సింపుల్ విషయాలు తెలియవా?.

రేవంత్ సర్కారు నిర్ణయాలపై అనుమానాలు ఎన్నో !
జస్టిస్ పీసి ఘోష్ కు అంత సింపుల్ విషయాలు తెలియవా?.
అంతా కావాలనే చేశారా?. కాంగ్రెస్ నేతల్లో కూడా అనుమానాలు
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కూడా ఒకటి. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్ట్ లో ఎంతో కీలకం అయిన మేడిగడ్డ బ్యారేజ్ కు చెందిన పిల్లర్లలో వచ్చిన భారీ భారీ పగుళ్లు ఈ ప్రాజెక్ట్ డొల్లతనాన్ని బయటపెట్టాయి. అప్పటి వరకు జరిగిన అవినీతి ప్రచారానికి ఇవి మరింత ఊతం ఇచ్చినట్లు అయింది. అందుకే ఎన్నికల్లో ఇది కూడా బాగానే ప్రభావం చూపించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను దెబ్బకొట్టినట్లే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంచబోతుందా?. అంటే అవుననే చర్చ సాగుతోంది ఆ పార్టీ నేతల్లో. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఎన్నో అనుమానాలకు కారణం అవుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ...ఆ కంపెనీ అధినేత మేఘా కృష్ణ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో దోచుకుంటున్నారు అని ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అప్పటి సీఎం కెసిఆర్ తో పాటు మేఘా ఇంజినీరింగ్ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడినట్లు ఆయన ఎన్నో సార్లు చెప్పారు. సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఏర్పాటు చేసిన జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ విచారణ పరిధి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీలాగా తెలంగాణను దోచుకుంటుంది అని ఆరోపించిన మేఘా ఇంజనీరింగ్ కు కేటాయించిన పనులు అన్నిటిని ఈ విచారణ పరిధి నుంచి మినహాయించారు. దీంతోనే సీఎం రేవంత్ రెడ్డి ..కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ ఏంటో అర్ధం అవుతుంది అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ జడ్జి పీ సి ఘోష్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి గా...పలు హై కోర్టుల్లో జడ్జి గా..తర్వాత ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా కూడా పని చేశారు. ఇంత అనుభవం ఉన్న జడ్జి నేతృత్వం వహించిన విచారణ కమిషన్ రిపోర్ట్ ను తెలంగాణ హై కోర్ట్ పక్కన పెట్టింది.
ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లపై ఎలాంటి చర్యలు తీసుకోవటానికి వీలు లేదు అని ఆదేశించింది. ఇందుకు కోర్టు చెప్పిన కారణం సెక్షన్ 8 బి ప్రకారం పీ సి ఘోష్ కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ వాదన వినటానికి అవకాశం కల్పించలేదు అని వెల్లడించింది. హై కోర్టు చీఫ్ జస్టిస్ గా...సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసిన పీ సి ఘోష్ కు ఇంతటి కీలక..సింపుల్ విషయం తెలియకుండా ఉండే అవకాశం ఏ మాత్రం లేదు అని...ఇది అంతా చూస్తుంటే అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లు కనిపిస్తోంది అని కొంత సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఎంత సేపు ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజకీయ లబ్ది కోణంలో ఆలోచిస్తూ వెళ్ళిందే తప్ప...కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో ఎక్కడా కూడా సీరియస్ గా వ్యవహరించలేదు అని స్పష్టంగా కనిపిస్తోంది అని చెపుతున్నారు.
ఇందుకు ప్రధాన కారణం మొత్తం విచారణ పరిధి నుంచి మేఘా ఇంజనీరింగ్ ను తప్పించటం ఒక్కటి చాలు అని ఒక ఐఏఎస్ వ్యాఖ్యానించారు. వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే వచ్చే ఎన్నికల్లో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంగ్రెస్ సర్కారు ను ముంచటం ఖాయం అని ఆ పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది అంతా గతంలో చెప్పిన దానికి భిన్నంగా ఉండటమే. తెలంగాణ హై కోర్టు జస్టిస్ పీ సి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవటానికి వీలు లేదు అని చెప్పిన వెంటనే బిఆర్ఎస్ అసలు ఇందులో స్కామే లేదు...ఇది అంతా కాంగ్రెస్ కుట్ర అంటూ ఎదురుదాడి స్టార్ట్ చేసింది. ఇది అంతా చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తనకు తానుగా బిఆర్ఎస్ కు అస్త్రాలు ఇస్తున్నట్లు ఉంది అనే చర్చ కూడా కాంగ్రెస్ నేతల్లో సాగుతోంది. హై కోర్టు కేవలం సాంకేతిక కారణాలతో ఈ నివేదికను పక్కన పెట్టింది కానీ...ఎక్కడా గత పాలకులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. అయినా సరే బిఆర్ఎస్ మాత్రం ఈ సాంకేతిక అంశాలను అడ్డంపెట్టుకుని రేవంత్ రెడ్డి కల్పించిన వెసులుబాట్లను వాడు



