Telugu Gateway
Telugugateway Exclusives

జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో కీలక డ్యాక్యుమెంట్లు మాయం?!

జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో కీలక డ్యాక్యుమెంట్లు మాయం?!
X

పాత స్కామ్ ల సమాచారం దొరకుండా ముందు జాగ్రత్త చర్యలు!

మాయం చేసిన వారే సాయం చేసే పనిలో!

విజిలెన్స్ నివేదిక బూజు దులుపుతున్న కమిటీ

జూబ్లిహిల్స్ హౌసింగ్ లో స్కామ్ ల పుట్ట పగలనుందా?. గత పాలకమండలి హయాంలో జరిగిన స్కామ్ లు, అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు రానుందా?. కొత్తగా ఎన్నికైన కమిటీ ఈ అంశాలపైనే ఫోకస్ పెట్టిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ స్కామ్ లు, అక్రమాల విషయంలో అందితే జుట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే తత్వం ఉన్న ఓ కీలక వ్యక్తిపైనే ఫోకస్ పెట్టారు. అయితే తమ స్కామ్ లు ఎక్కడ బయటకు వస్తాయో అన్న ఉద్దేశంతో కొంత మంది బడాబాబులు ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్లను మాయం చేసినట్లు నూతన కమిటీ గుర్తించింది. అయితే ఈ డాక్యుమెంట్లను గుర్తించే ప్రక్రియ సాగుతోంది. మాయం చేసిన వారే ఇప్పటి కమిటీకి సాయం చేయటానికి కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. బినామీ పేర్లతోనూ గత కమిటీలోని కొంత మంది అక్రమాల దందా సాగించినట్లు గుర్తించారు. దీంతో పాటు హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు సంబంధించి వైఎస్ హయాంలో ఉన్నటువంటి విజిలెన్స్ నివేదికపైనూ నూతన కమిటీ దృష్టి సారించింది.

తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఇంతకాలం కోట్లాది రూపాయల అక్రమాలకు సంబంధించిన నివేదికలపై ఎలాంటి చర్యలు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. కానీ ఇఫ్పుడు పరిస్థితులు మారటంతో కీలక వ్యక్తుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో పాత కమిటీలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదంటే సొసైటీలో వీరిపై ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం అవుతుందని చెబుతున్నారు. జూబ్లిహిల్స్ హౌసొంగ్ సొసైటీలో సాగిన వందలాది కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో త్వరలోనే చర్యలు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Next Story
Share it