Telugu Gateway
Telugugateway Exclusives

ఉత్తమ రాజకీయ 'సహాయ పార్టీ'గా జనసేన

ఉత్తమ రాజకీయ సహాయ పార్టీగా జనసేన
X

అసలు ఏపీలో ఇప్పుడు బిజెపికి ఎవరైనా ఓట్లు వేస్తారా?

జనసేన నిర్ణయం 'టీడీపీ'కి లాభం!

సినిమాల్లో హీరో పక్కన చాలా మంది సహాయ నటులు ఉంటారు. వారి పాత్రలు కూడా సినిమాకు చాలా కీలకం అవుతాయి. అంతే కాదు అలాంటి వారికి అప్పుడప్పుడు 'ఉత్తమ సహాయ నటుడు' అవార్డులు కూడా వస్తుంటాయి. రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఏపీతోపాటు తెలంగాణాలో కూడా జనసేన ఉత్తమ సహాయ (బెస్ట్ సపోర్టింగ్) పార్టీగా మారిపోయింది. ఆ పార్టీ వరస నిర్ణయాలు చూస్తే విషయం మనకే అర్ధం అవుతుంది. 'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తాం. జనసేన ప్రకటన. కానీ బరిలో నిలవకుండా బిజెపికి 'మద్దతు' రాగం. బిజెపి అవమానించినా మద్దతు విషయంలో ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. తిరుపతి లోక్ సభ సీటు మాకే కావాలి. బిజెపి కంటే మాకే అక్కడ ఎక్కువ బలం ఉంది. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. బిజెపికే లోక్ సభ సీటు. తిరుపతి అభివృద్ధి..రాష్ట్రం మేలు కోసమే నిర్ణయం. పవన్ కళ్యాణ్ ప్రకటన'. ఓ సారి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి సీటుపై ఏదో అంటే జనసేన పెద్ద సీనే క్రియేట్ చేసింది. కానీ అంతా తిరిగి వచ్చి అదే కథ రిపీట్ అయింది.

జనసేన పార్టీ పెట్టిన వెంటనే టీడీపీ- బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అసలు ఏపీలో ఇప్పుడు బిజెపికి ఎవరైనా ఓటు వేసే పరిస్థితి ఉందా?. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా 'విశాఖ స్టీల్ ప్లాంట్ ' విషయంలో బిజెపికి ముందుకెళుతోంది. జనసేన కూడా దీనికి మద్దతుగా అన్నట్లు దేశం కోసం తీసుకున్న నిర్ణయం అంటూ ప్రకటన చేసింది. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలోనే కాదు..ఏపీకి సంబంధించిన ఎన్నో అంశాల్లో బిజెపికి చేసిన అన్యాయం అంతా ఇంకా కాదు. అలాంటిది జనసేన తాను కాకుండా బిజెపికి సీటు ఓకే అని చెప్పి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోసినట్లు అయింది. బిజెపి కాకుండా ఈ పరిస్థితుల్లో జనసేన తిరుపతి లోక్ సభ బరిలో నిలిచి ఉంటే రాయలసీమలో బలంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలతోపాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్తేజంతో పనిచేసేవారు..గౌరవప్రదమైన ఓట్లు మాత్రం దక్కేవి.

ఇప్పుడు సీటు బిజెపికి ఇవ్వటం ద్వారా అధికార వైసీపీకి ఓటు వేయటం ఇష్టం లేని వారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా బిజెపి వైపు కాకుండా టీడీపీ వైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. బిజెపి మద్దతుతో జనసేన బరిలో నిలిచి ఉంటే మూడవ స్థానానికి ఎవరు పోతారు అన్న టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ టెన్షన్ ఏమీలేదు. ఖచ్చితంగా అంతకు మించిన ఫలితాలు వస్తే అది ఏపీ రాజకీయాల్లో అది పెద్ద అద్భుతమే అవుతుంది. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నిర్ణయాలతో పార్టీ క్యాడర్ తోపాటు లీడర్లను కూడా ఎప్పటికప్పుడు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.

Next Story
Share it