Telugu Gateway
Telugugateway Exclusives

తెలంగాణలో జర్నలిస్టులు 'సూపర్ స్ప్రెడర్స్ ' అంట

తెలంగాణలో జర్నలిస్టులు సూపర్ స్ప్రెడర్స్  అంట
X

పలు రాష్ట్రాలు కరోనా వారియర్స్ గా ప్రకటన

తెలంగాణలో మాత్రం ప్రత్యేక ట్రీట్ మెంట్

సర్కారు తీరుపై విస్మయం

దేశంలోని పలు రాష్ట్రాలు జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా ప్రకటిస్తున్నాయి. ఎవరైనా జర్నలిస్టు కరోనా బారిన పడి మరణిస్తే ఆర్ధిక సాయం కూడా పర్కటించాయి.. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు ఈ మేరకు అధికారిక ప్రకటనలు చేశాయి. తాజాగా పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ విచిత్రంగా తెలంగాణ సర్కారు మాత్రం జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా ప్రకటించకపోగా..వాళ్ళను సూపర్ స్ప్రెడర్స్ జాబితాలో చేర్చి ఈ నెల 28 నుంచి వ్యాక్సినేషన్ అందివ్వనున్నట్లు ప్రకటించింది.

కరోనా కష్టకాలంలోనూ అటు ఆస్పత్రుల చుట్టూ..ఇటు వైద్యాధికారుల చుట్టూ తిరుగుతు వార్తల కవర్ చేస్తున్న జర్నలిస్టులను సూపర్ స్పెడర్స్ గా పేర్కొనటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. కరోనా వారియర్స్ గా ప్రకటించి సాయం చేయకపోగా...ఇలా సూపర్ స్ప్రెడర్స్ జాబితాలో చేర్చటంపై జర్నలిస్టులు అవాక్కు అయ్యారు. ఈ నెల 28 నుంచి ఎల్ పీజీ డెలివరి స్టాఫ్, పెట్రోల్ రీఫిల్ స్టేషన్ స్టాఫ్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, నాన్ వెజ్ ఫిష్ మార్కెట్ వెండర్స్, లిక్కర్ షాప్ వెండర్స్ తో పాటు మీడియా ను కూడా ఆ జాబితాలో చేర్చారు.

Next Story
Share it