జగన్ ను పవన్ కళ్యాణ్ అదే ప్రశ్న అడిగితే?!
కెసిఆర్ పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చాక తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ దిగటానికి పరోక్షంగా కారణం అయిన చంద్రబాబు నాయుడే మళ్ళీ తెలంగాణ లో టీడీపీ కారక్రమాలు పెంచారు. మరి జగన్ ఆ పని ఎందుకు చేయటంలేదు అన్నది ఇప్పుడు తెరపైకి రావటం ఖాయం. వైస్సార్ సీఎం చేసింది ఉమ్మడి రాష్ట్రంలో...ఆయనకు తెలంగాణ లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. కెసిఆర్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో పోటీకి సిద్ధం అవుతున్న వేళ జగన్ వైసీపీ తెలంగాణాలో పోటీ చేయటానికి ఇబ్బంది ఏమి ఉంటది. పైగా ఆర్థికంగా...అన్ని రకాలుగా వైసీపీ ఇప్పుడు బలంగా ఉంది. అయినా కూడా వైసీపీ, జగన్ లు తెలంగాణ లో పోటీ అంశంపై ఏమి మాట్లాడం లేదు అంటే షర్మిల పార్టీ వైస్సార్ టి పి కి సాయం చేయటానికా...లేక కెసిఆర్ కు ప్రయోజనము కల్పించటానికా అన్న చర్చ సాగుతోంది. షర్మిల పార్టీ పెట్టిన సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి తాము చాలా విషయాలు అలోచించి తెలంగాణలో పోటీ వద్దని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితి అది కాదు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు పవన్ కళ్యాణ్ ను డిమాండ్ చేస్తున్నట్లు వైసీపీ తెలంగాణాలో 119 సీట్లలో పోటీచేయాలని డిమాండ్ చేస్తే అందుకు జగన్ అంగీకరిస్తారా.?. గత ఎన్నికల సమయంలో వైసీపీ కి అప్పట్లో అధికారంలో ఉన్న ఇప్పటి బిఆర్ఎస్ సాయం చేసినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరిగింది. మరి ఇదే కారణం తో జగన్ ఛాన్స్ ఉన్నా తెలంగాణ లో పోటీకి దూరంగా ఉంటే దీనిపై పలు అనుమానాలు రావటం ఖాయం.