Telugu Gateway
Telugugateway Exclusives

ఈటెల ఎఫెక్ట్...కెసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు తెరిచారు

ఈటెల ఎఫెక్ట్...కెసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు తెరిచారు
X

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెల‌వొచ్చు..ఓడిపోవ‌చ్చు. ఏమైనా జ‌ర‌గొచ్చు. కానీ మార్పు మాత్రం చాలా స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది. ఏడేళ్ళ‌లో తొలిసారి. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు ప్ర‌తిప‌క్ష పార్టీల కోసం తెరుచుకున్నాయి. ముఖ్య‌మంత్రి కెసీఆర్ లో ఎందుకు ఇంత మార్పు వ‌చ్చింది. అక‌స్మాత్తుగా సిఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు ఇత‌ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ఎందుకు సీఎం కెసీఆర్ ఆహ్వానించారు. మ‌రియ‌మ్మ లాకప్ డెత్ తోపాటు ఇత‌ర అంశాల‌పై మాట్లాడేందుకు సీఎం కెసీఆర్ కాంగ్రెస్ నేత‌ల‌కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. మామూలుగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌కు సీఎం అపాయింట్ మెంట్ అనేది పెద్ద విష‌యం కాదు. కానీ ఇప్పుడు ఇది ఓ సంచ‌ల‌నం. ఎందుకంటే గ‌తంలో చాలాసార్లు కాంగ్రెస్ ఎంపీలు,, ఎమ్మెల్యేలు సీఎం కెసీఆర్ అస‌లు త‌మ‌కు అపాయింట్ మెంట్లు ఇవ్వ‌టంలేదంటూ బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గప్పించారు. అయినా స‌రే కెసీఆర్ డోంట్ కేర్ అన్నారే త‌ప్ప ఎవ‌రినీ లోప‌లికి రానివ్వ‌లేదు.

అంతే కాదు ఏకంగా అసెంబ్లీలోనే ప్ర‌జ‌లు మాకు తీర్పు ఇచ్చారు..మా విధానాలు.మాకు న‌చ్చిన‌ట్లు చేస్తాం త‌ప్ప‌..మీరు చెప్పిన‌ట్లు మేం ఎందుకు చేస్తామంటూ ప్ర‌శ్నించారు. తాము చేసేది త‌ప్పు అయితే ప్ర‌జ‌లు త‌ర్వాత ఎన్నిక‌ల్లో నిర్ణ‌యం తీసుకుంటార‌ని వ్యాఖ్యానించారు. అందుకే ఎప్పుడూ కూడా ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌తో మాట్లాడింది లేదు..ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి ఎంట్రీ ఇచ్చింది లేదు. కానీ అక‌స్మాత్తుగా కెసీఆర్ లో ఈ మార్పు రావ‌టానికి ఈటెల రాజేంద‌ర్ ఎఫెక్టే అన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. మంత్రుల‌కే చాలాసార్లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి ఎంట్రీ దొర‌క‌లేద‌ని..అది ప్ర‌గ‌తిభ‌వ‌న్ కాదు..బానిస భ‌వ‌న్ అంటూ ఈటెల పార్టీకి రాజీనామా చేశాక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఏది ఏమైనా తొలిసారి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు కు ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేట్లు తెరుచుకోవ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేసిన స‌మ‌యంలో అంద‌రికీ చూపిస్తాన‌ని కూడా కెసీఆర్ అప్ప‌ట్లో మాటిచ్చారు. కానీ అది కూడా అమ‌లుకు నోచుకోలేదు.

Next Story
Share it