Telugu Gateway
Telugugateway Exclusives

సభలో సీఎం జగన్ మాటలు..యాక్షన్స్ పీక్ కు

సభలో సీఎం జగన్ మాటలు..యాక్షన్స్ పీక్ కు
X

ఒకప్పడు అసెంబ్లీలో ఏదైనా పరుష పదజాలంలోవస్తేనే నానా రచ్చ నడిచేది. అన్ పార్లమెంటరీ పదాలు అంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యేవి. ఎక్కువగా అన్ పార్లమెంటరీ పదాలపై అభ్యంతరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అన్ పార్లమెంటరీ అన్న పదం ఎత్తేవారే లేకుండా పోయారు. స్వయంగా సబా నాయకుడు అయిన ముఖ్యమంత్రే రకరకాల యాక్షన్స్ చేయటమే కాదు...పలు రకమైన పరుష పదాలను అలవోకగా వాడేస్తున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని 'నీకు మెంటల్ ఎక్కింది. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలి. ఎవరికైనా చూపించండి. పైన కంపార్ట్ మెంట్ అంతా ఖాళీ అయింది అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. అంతే కాదు..టీడీపీ సభ్యుడు రామానాయుడిని పట్టుకుని స్వయంగా సీఎం జగన్ డ్రామానాయుడు అంటూ వ్యాఖ్యానించారు.

సభా నాయకుడు అయిన సీఎం స్వయంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రామానాయుడిని పట్టుకుని స్వయంగా డ్రామానాయుడు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా సభ్యులను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేయటం చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు. టీడీపీ సభ్యులు సభలో ఓ అనుచిత ప్రయోగం చేస్తే దాన్ని ఉచ్చరించకుండా ఉండాల్సిందిపోయి సీఎం జగన్ పదే పదే అదే మాటను సభలో వాడి అందరిని షాక్ కు గురిచేశారు. అంతే కాదు..అత్యంత కీలకమైన పోలవరం చర్చ సందర్భంగా కూడా సీఎం జగన్ మీరు ప్రాజెక్టును అంతా పెంట పెంట చేసి పోయారని పలుమార్లు టీడీపీని ఉద్దేశించి ప్రస్తావించి అధికారులను కూడా షాక్ కు గురిచేశారు. బయట వాడుక భాష..సభా సంప్రదాయాలు..సభలో వాడే భాష అన్న తేడా లేకుండా పోయిందని అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు . స్వయంగా ముఖ్యమంత్రే ఇలాంటి భాష వాడుతుండటంతో ఇక మంత్రులు...ఎమ్మెల్యేలు అయితే మరింత రెచ్చి పోయి సినిమాటిక్ డైలాగ్ లు చెబుతున్నారు. మండలిలో కూడా ఈ సమావేశాల్లోనే అభ్యంతరకర వ్యాఖ్యలు పీక్ కు చేరాయి.

Next Story
Share it