Telugu Gateway
Telugugateway Exclusives

కట్టాల్సినప్పుడు కట్టకుండా ఈ ఫోటోలేంటి?

కట్టాల్సినప్పుడు కట్టకుండా ఈ ఫోటోలేంటి?
X

ఏ ప్రభుత్వానికి అయినా ప్రాధాన్యాత ఉండాలి. అందునా విభజిత రాష్ట్రానికి రాజధాని తొలి ప్రాధాన్యత కావాలి. ఐదేళ్ళ కాలంలో..ఓ రాష్ట్రానికి రాజధాని నిర్మించే అవకాశం రావటం అంటేనే అద్బుతం. అలాంటి అవకాశం అందరికీ దక్కదు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతే రాజధాని అని అందరినీ నమ్మించి... అధికారంలోకి వచ్చాక ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట మార్చారు. ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ జగన్ కు ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు?. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేసింది ఎవరు?. రాజధాని ప్రాంతం అని అక్కడ వంద గజాలో..రెండు వందల గజాలో స్థలాలు కొనుక్కున్న వారు నష్టపోవటానికి కారణం ఎవరు?. ఖచ్చితంగా ఇందులో మొదటి పాపం చంద్రబాబుదే అని చెప్పకతప్పదు. ఐతే ఐదేళ్ళలో అంతా అయిపోతుందని ఎవరూ చెప్పరు. కానీ రాజధానికి కావాల్సిన అత్యంత కీలకమైన సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ వంటి శాశ్వత భవనాలను చంద్రబాబు నిర్మించి ఉంటే..ఇప్పుడు జగన్ మూడు రాజధానుల ఆలోచన చేయటానికి ఛాన్సే ఉండేదది కాదు.

చంద్రబాబు తలపెట్టినట్లు తొమ్మిది నగరాలు రాకపోయి ఉండొచ్చు. కానీ రాజధాని ప్రాంతం ఖచ్చితంగా అమరావతిలోనే ఉండేది. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ డిజైన్ల కోసం మూడేళ్ల సమయంలో వృధా చేయటం అంటే మామూలు విషయం కాదు. స్వయంగా కొంత మంది టీడీపీ నేతలు కూడా శాశ్వత రాజధాని భవనాలను ఎన్నికల నాటికి పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పినా ఆ రోజు వినటానికి చంద్రబాబు ఏ మాత్రం వినటానికి ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మాత్రం ఏదేదో చెబుతున్నారు. రాజధానికి భూములు ఇఛ్చిన రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ ప్రాంతంలో వైసీపీ తప్ప అన్ని పార్టీల మద్దతుతో బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాల వద్ద చంద్రబాబు ఫోటోలు దిగారు.

అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లోని 13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి తీసుకొచ్చిన పవిత్రమట్టి, పుణ్యజలాలతో అభిషేకించిన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భూమిపూజ స్థలం వద్ద మోకరిల్లారు. అప్పటి స్మృతులను, టిడిపి హయాంలో శరవేగంగా అభివృద్ది పనులను తల్చుకుని, ప్రస్తుత వైసిపి 18నెలల పాలనలో ఆపేసిన పనుల దుస్థితిపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని టీడీపీ తెలిపింది. అయితే చేయాల్సినప్పుడు..చేయాల్సిన పని చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it