లోకేష్ ముందుకు..చంద్రబాబు వెనక్కు!
మరో విశేషం ఏమిటంటే అందులోనే ఓ మూలన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తోపాటు ఏపీ పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, తెలంగాణ పార్టీ నాయకుడు బక్కని నర్సింహుల ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవి తరచితరచి చూస్తే తప్ప కన్పించవు. కానీ చంద్రబాబు రెండు ఖాతాల్లోనూ ఆయన ఫోటోను ఓ మూలకు నెట్టేసి...నారా లోకేష్ ముందుకు వచ్చేశారు. ఇది చూస్తే అసలు పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబా లేక నారా లోకేష్ అన్న అనుమానం రాకమానదు. పార్టీలో ఆదిపత్యం..పెత్తనం ఎవరిదో ఇలా చెప్పినట్లు ఉన్నారనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది.