Telugu Gateway
Telugugateway Exclusives

బాబు పిలిస్తే రావాలి...వదిలేసి వెళితే వెళ్ళాలి

బాబు పిలిస్తే రావాలి...వదిలేసి వెళితే వెళ్ళాలి
X

తెలుగు దేశం అధినేత చంద్రబాబు కి అవసరం వచ్చినప్పుడు పిలిస్తే అందరూ రావాలి. అయన అవసరం తీరాక అటు నాయకులను..ఇటు క్యాడర్ ను మధ్యలో వదిలేసి వెళితే అందరూ ఆలా ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. బుధవారం నాడు ఖమ్మం జిల్లా సభలో అయన చేసిన వ్యాఖలు చూసిన వారు ఎవరికైనా ఇదే అభిప్రాయం కలగక మానదు. ఒకప్పుడు టీడీపీ కి తెలంగాణ లో అత్యంత బలమైన నాయకులు ఉన్నారు..క్యాడర్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, జీహెచ్ఎంసీ ప్రాంతంతో పాటు పలు జిల్లాల్లో టీడీపీ కి గట్టి పునాదులు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ తన సత్తాను చాటింది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ నాయకులు..క్యాడర్ చల్లా చెదురు కావటానికి ముఖ్య కారకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అనే ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమి కాదు. ఎందుకు అంటే ఎన్నికల బరిలో దిగాలంటే కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యవహారం. ఇప్పటికి తెలంగాణ ప్రాంతంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా నష్టపోయారు. పెద్ద నాయకులు కొంత మంది లాభ పడితే లాభ పడి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పడు అయినా చంద్రబాబు తెలంగాణ లో సీరియస్ గా రాజకీయాలు చేస్తారా..లేక పోతే గతంలో మాదిరే చేస్తారా అన్న అనుమానాలు చాలా మంది నేతల్లో ఉన్నాయి. నాయకుకు అనే వాడు నిలబడాలి. ముందు ఉండి నడిపించాలి. ఏ సమస్య వచ్చిన చూసుకోవటానికి పార్టీ అధినేత..లేక పోతే అయన నియమించిన టీం ఉందనే భరోసా ఇవ్వాలి. నాయకుడు ప్రతి విషయంలో జోక్యం చోసుకోవటం సాధ్యం కూడా కాదు. కానీ దీనికి ఒక వ్యవస్థ పెడితే అదే పనిచేస్తుంది. నాయకుడి అవసరం ఉన్నప్పుడు వస్తే చాలు. ఎవరు ఇలా చేసిన ఆ పార్టీ నాయకులు ..క్యాడర్ ఎంత తెగించి అయినా రాజకీయ పోరాటం చేయటానికి సిద్ధపడతారు. కానీ తెలంగాణ టీడీపీ విషయంలో చంద్రబాబు ఆ పని చేయలేక పోయారు.

దీంతో పార్టీ నాయకులు..అభిమానులు తలో దారి చూసుకున్నారు. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ లో ఒక కొత్త నగరాన్ని సృష్టించటంలో చంద్రబాబు పాత్రను ఎవరు కాదనలేరు. కాకపోతే ఎన్నికల్లో గెలుపునకు ఇది ఒక్కటే సరిపోదు. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మూల సిద్ధాంతాలకు బిన్నంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలుగు దేశం కోర్ అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ ని కూడా తెలంగాణ లో చావు దెబ్బ తీశారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. బుధవారం నాడు ఇంత భారీ ఎత్తున జరిగిన ఖమ్మం సభలో అధికార బిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయకపోవటం చంద్రబాబు డొల్ల తనాన్ని మరో సారి చూపించింది అనే చర్చ నడుస్తోంది. ఇదే చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ లో ఎలా మాట్లాడుతున్నారు...మరి తెలంగాణ కు రాగానే ఇలా ఎందుకు మారిపోతున్నారు అనే సందేహాలు ఎవరికైనా వస్తాయి కదా?. అంటే చంద్రబాబు ఇంకా కెసిఆర్ కు భయపడుతున్నారా...ఇలా భయపడితే ఆయన రాజకీయం ఏమి చేస్తారు అన్నది టీడీపీ నేతల సందేహం.తెలంగాణ సెంటిమెంట్ తో భారీగా లబ్ధిపొందిన కెసిఆర్ స్వయంగా పార్టీ పేరులో నుంచే తెలంగాణ ను తీసేశారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగు దేశం వచ్చినా..మరొకరు వచ్చినా సెంటిమెంట్ అస్త్రాన్ని వాడే అవకాశాన్ని బిఆర్ఎస్ కోల్పోతుంది. ఎందుకు అంటే ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు అంతా రాక్షసులే అని విమర్సించిన కెసిఆర్ అక్కడ తన పార్టీని బరిలో నిలిపే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి ఈ అవకాశాన్ని చంద్రబాబు ఎంత సీరియస్ గా వాడుకుంటారు అన్నది ఇప్పుడు అత్యంత కీలకం కానుంది.

Next Story
Share it