'బుగ్గన' బుక్కయ్యారు
అప్పులు అప్పుడు తప్పన్నారు..ఇప్పుడు గర్వమంటున్నారు
అప్పు చేయటాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటారా అన్న బుగ్గన
ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఈ బుక్ అవటానికి కారణం రాష్ట్ర అప్పుల వ్యవహరమే. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులపై ఆయన ఏమి మాట్లాడారు..ఇప్పుడు అప్పులపై ఏమి మాట్లాడుతున్నారో చూడండి అంటూ ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. 'ఒకసారి చూద్దాం. ఇప్పటికే రాష్ట్ర అప్పుల పరిస్థితిని ఎక్కడకు తీసుకెళ్లారో. అసలు మీరు ఎందుకింత అప్పులు చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ దేని కోసం. కట్టేదెవరండి. మీ అప్పులు అంతా కట్టేది ఎవరు ప్రజలు. మనమందరం. ఎవరైతే పన్ను కడుతున్నారో మనందరం కట్టాలి. ఎందుకంటే మీ డబ్బులు కావు ఇవి. ప్రజల డబ్బు. ఫస్ట్ అసలు అప్పే చేయరాదు. ఎవరు కడతారు అండీ ఈ అప్పులు అంతా. మీరు అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోతున్నారు.రేపొద్దున కట్టబోయే వాళ్లు మనం ఎంత అప్పు చేయాలి. ఎవరా అప్పు కట్టాలి. ఏ విధంగా కట్టాలి. అప్పు చేయటాన్ని కూడా ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. చేసేది అప్పు. చేసేది ప్రజలపై మోపేది భారం. కానీ గొప్ప పని అన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని మనం ఓ సారి గమనించాలి. దయచేసి మానుకోండి. ఇది పద్దతే కాదు..మీరు ఏమి చేయాలంటే ఫస్ట్ ఇది మానుకోండి.
విపరీతమైన అప్పులు చేసేది మానుకోండి.' అంటూ అప్పటి అధికార టీడీపీకి సలహా ఇచ్చారు బుగ్గన. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే కొత్త పాత్రలోకి ఎంట్రీ ఇచ్చారు. అదేంటి అంటే ఆర్ధిక శాఖ మంత్రి హోదాలో అప్పులపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమి చెప్పారో ఓ సారి చూడండి. ' అవునండి. అప్పు చేశాం. తప్పేమీ నాకు అర్ధం కాలేదు. ఏమి. అవునండి జరిగింది. అప్పులు చేయాల్సి వచ్చింది. కొంత మేరకు..కొంత వరకూ అప్పు చేయాల్సి వచ్చింది. ఎవరి కోసం చేయాల్సి వచ్చింది. ప్రజల కోసం..ప్రజల బాగోగుల కోసం. కొద్దిగా అప్పు ఎక్కువైంది. దానికి ఏదో విపరీతమైన తప్పు చేశారు..పొరపాటు చేశారు అన్నట్లు మాట్లాడుతున్నారు.అప్పులు అవసరం వచ్చాయి కాబట్టి అప్పు చేయటం జరిగింది. ఈ రోజు గర్వంగా చెబుతున్నాం. దీంట్లో దాపరికం ఏమీలేదు. చేయాల్సి వచ్చింది.
సామాన్య మానవుడిని కాపాడుకునేందుకు. పరిపాలన చేయటానికి..ప్రభుత్వం అన్ని రకాలుగా పరిపాలన చేయటానికి అప్పు చేయాల్సి వచ్చింది. జగనన్న అమ్మ ఒడి అయితేనేమి. జగనన్న వసతి దీవెన అయితేనేమి. జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్య, వైఎస్ఆర్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ, మత్సకార భరోసా, చేయూత, ఆసరా, బీమా, కాపు నేస్తం, నేతన్నల నేస్తం, చేదోడు . ఆ నేస్తం ఇవన్నీ కలుపుకుని రెండు సంవత్సరాల కాలంలో ఇంచుమించు ఒక లక్ష చిల్లరకోట్లు డైరక్ట్ గా పబ్లిక్ లోకి పోవటం జరిగింది. బెనిఫిషియరీస్ వచ్చి కొన్ని కోట్లాది మంది ఉన్నారు.' అని తెలిపారు. గతంలో చెప్పిన వీడియో..ఇప్పటి వీడియోలను జాయింట్ చేసి బుగ్గనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంటే అప్పులపై ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట..అధికారంలో ఉంటే మరో మాట అన్నట్లు వీడియోలతో దొరికిపోయారు. గతంలో వైసీపీ ఇదే పనిచేసింది..ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా పని చేస్తు్న్నాయి అంతే.