నిజమా...నమ్మొచ్చా!
ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కొంతమంది ఐఏఎస్ అధికారులు చెపుతున్న మాట. మండు వేసవిలో అయన తన జోక్ ద్వారా అందరిలో నవ్వులు పూయించారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా జవహర్ రెడ్డి చెప్పిన మాట నమ్మితే అది ఒక రికార్డు అవుతుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ రాష్ట్రానికి సంబదించిన విషయానికి వస్తే ఆదేశిస్తారు తప్ప...సహజంగా ఎవరి మాటను పెద్దగా పరిగణనలోకి తీసుకోరు అని అటు మంత్రులతో పాటు ఇటు అధికారుల్లో కూడా ప్రచారంలో ఉంది. అలాంటిది ఆంధ్ర ప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి మంగళవారం నాడు మీడియా సాక్షిగా చేసిన కామెంట్స్ చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు...నిజమా...అలా జరిగిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు కూడా.విభజన సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు తనతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి, మరికొంత మంది కార్యదర్సులు ఢిల్లీ వెళుతున్నామని. కేంద్రంలో ఉన్నత స్థాయిలో మాట్లాడేందుకు అక్కడ సీఎం జగన్ అవసరం ఉంటుంది కాబట్టి మాకు అందుబాటులో ఉంటే బాగుంటుంది అని కోరాం..వ్యక్తిగత పర్యటనలు ఉన్నా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశాం ..మా విజ్ఞాపన మేరకే సీఎం తన విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నారు అని
సిఎస్ జవహర్ రెడ్డి మీడియా కు చెప్పారు. సీఎం అయినా...మంత్రులు అయినా తమ అవసరాలు..వెసులుబాటు బట్టి విదేశీ పర్యటనలు పెట్టుకుంటారు...అవసరం అయితే వాయిదా వేసుకుంటారు. ఇది అసాధారణం అంశం ఏమీ కాదు. విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ కేంద్ర పెద్దలకు చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చారు కానీ అవేమి పెద్దగా ముందుకు కదిలిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు సి ఎస్, ఇతర అధికారులు చర్చలు జరిపి బయటకు వచ్చి సీఎం జగన్ కు చెపితే అయన అప్పటికప్పుడు కేంద్ర పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారా..ఇది అసలు ఏ మాత్రం అయినా నమ్మటానికి అవకాశం ఉందా అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాలకు వెళ్లే టపుడు.అధికారులు ప్రభుత్వ వైఖరి ఏంటో క్లారిటీ తీసుకుని వెళతారు...అవసరం అనుకుంటే దేశం లో ఉన్నా...విదేశాల్లో ఉన్నా ఈ డిజిటల్ యుగం లో సీఎం ను కాంటాక్ట్ చేసి తగు సూచనలు తీసుకోవటం పెద్ద కష్టం ఏమి కాదు...అలాంటిది సీఎం జగన్ ను సిఎస్ జవహర్ రెడ్డి మీరు మాకు అందుబాటులో ఉండాలి అని అడగటం..అందుకు అయన ఓకే అనటం అంటే ఇది ఏ మాత్రం నమ్మబుల్ గా లేదు అని ఒక ఐఏఎస్ అభిప్రాయపడ్డారు.
ఇది పై నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చెప్పిన మాట తప్ప...జవహర్ రెడ్డి కూడా సీఎం ను మేము ఆగమన్నాం..ఆగిపోయారు అని చెప్పటం అంటే జరిగే పని కాదు అని మరొకరు విశ్లేషించారు. మొత్తానికి జవహర్ రెడ్డి కామెంట్స్ అటు రాజకీయ వర్గాలతో పాటు అధికార వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. వై ఎస్ వివేకా హత్య కేసు లో భాస్కర్ రెడ్డి అరెస్ట్, ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చిన తరుణంలో సీఎం జగన్ విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని కౌంటర్ చేయటానికి జవహర్ రెడ్డి ఇది అంతా చెప్పినట్లు కనిపిస్తోంది అని...అయితే నాలుగేళ్లుగా జగన్ పాలనా స్టైల్ చూస్తున్న వారు ఎవరూ దీన్ని నమ్మే అవకాశం లేదు అని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
.