Telugu Gateway
Telugugateway Exclusives

జగన్ నోట బీజేపీ అండ మాట ఎందుకొచ్చిందో !

జగన్ నోట బీజేపీ అండ మాట ఎందుకొచ్చిందో !
X

ఏ పబ్లిక్ మీటింగ్ లో అయినా వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడితే తన పాలనకు...గత చంద్రబాబు పాలనకు పోల్చి చూడాలి అని ప్రజలకు చెపుతూ వస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆంధ్ర జ్యోతి, ఈనాడు, టీవీ 5 అంటూ పదే పదే ఏవ్ పేర్లు చెపుతారు. జగన్ మీటింగ్ అంటే అయన ఏమి మాట్లాడతారో టీవీ చూడకుండా కూడా చెప్పేయవచ్చు. ముఖ్యంగా రాజకీయ విమర్శల విషయంలో. అయితే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో మాట్లాడుతూ మనకు బీజేపీ అండ ఉండక పోవచ్చు అని వ్యాఖ్యానించారు. అసలు ఈ సింగిల్ సింహం .. బీజేపీ అండ ఉండకపోవచ్చు అని ఎందుకున్నట్లు అన్నదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. గత కొంత కాలంగా స్వయంగా సీఎం జగన్ తో పాటు వైసీపీ మంత్రులు...ఆ పార్టీ నేతలు సింహం సింగిల్ గానే వస్తుంది అని...తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు స్వయంగా జగన్ బీజేపీ అండ మనకు ఉండకపోవచ్చు అని ప్రకటించారు అంటే ఇంత కాలం ఆ పార్టీ తమకు అండదండలు అందించినట్లు ఒప్పుకున్నట్లు అయిందా అన్న చర్చ కూడా సాగుతుంది. విభజన హామీల్లో అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా తో పాటు పలు అంశాల్లో కేంద్రం ఏ మాత్రం సహకరించకపోయినా జగన్ ఎప్పుడు బహిరంగ వేదికలపై బీజేపీ ని విమర్శించలేదు. అంతే కాదు..తాజాగా బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పాలన అంతా అవినీతి మాయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయినా జగన్ మాత్రం దీనిపై నేరుగా మాట్లాడకుండా కేవలం మనకు బీజేపీ అండ ఉండకపోవచ్చు అంటూ కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికి అటు జగన్ తో పాటు వైసీపీ నేతలు నేరుగా బీజేపీ పై ఎటాక్ చేయటానికి భయపడుతున్నారు. నేరుగా బీజేపీ పై విమర్శలు చేయకుండా తెలుగు దేశం నుంచి చేరిన వారి ప్రభావంలో అమిత్ షా, నడ్డాలు ఉన్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా లు ఎవరో కొంత మంది చెప్పిన మాట విని రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు చెప్పగానే ప్రజలు నమ్ముతారా అన్న చర్చ కూడా సాగుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డాలు అధికార వైసీపీ పై ఈ స్థాయిలో ఎటాక్ చేస్తారని ఎవరు ఊహించలేదు. త్వరలో జరగబోయే రాజకీయ మార్పులకు ఇది సంకేతమా అన్న చర్చ కూడా సాగుతుంది. అదే సమయంలో టీడీపీ, జనసేన తో బీజేపీ జట్టుకట్టినా వైసీపీ దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవటానికి ఛాన్స్ లు ఉన్నాయి. దాని కంటే ముందు అసలు బీజేపీ వల్ల కలిగే లాభం ఏమిటి అన్నది కూడా టీడీపీ నేతల్లోనే ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎక్కువ మంది టీడీపీ నేతలు బీజేపీ మైనస్ అవుతుంది తప్ప..ప్లస్ కాదు అన్నది వాళ్ళ భావన. మరి ఈ రాజకీయ లెక్కల్లో ఎవరు మంచి మాస్టారో తేలాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.

సోనియా ని ఎదిరించిన జగన్ ...అమిత్ షా కు కౌంటర్ ఇవ్వలేరా?!

అమిత్ షా విమర్శలపై సౌండ్ చేయని జగన్

నిన్న అమిత్ షా. మొన్న బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జె పీ నడ్డా . గతంలో ఎన్నడూలేని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు పై ఘాటు విమర్శలు చేశారు. జె పీ నడ్డా విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. అయితే ఆదివారం నాడు విశాఖపట్నం కేంద్రంగా బీజేపీ కీలకనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన విమర్శలపై సీఎం జగన్ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడక పోవటం ఇప్పుడు కీలకంగా మారింది. అమిత్ షా అయితే ఏకంగా రైతుల ఆత్మ హత్యల విషయంలో సీఎం జగన్ సిగ్గుపడాలి అని విమర్శించారు. అంతే కాదు వైజాగ్ అరాచక శక్తులకు అడ్డాగా మారింది అని ..గత నాలుగు ఏళ్లలో ఆంధ్ర ప్రదేశ్ అంతా అవినీతిమయం చేశారు అంటూ మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ క్యాడర్ దోచుకుంటున్నారు అని విమర్శించారు. ఇంత ఘాటు విమర్శలు చేసినా...జగన్ పాలనలో అంతా అవినీతి అంటూ అటు అమిత్ షా, ఇటు నడ్డా మాట్లాడినా జగన్ మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. సహజంగా అయితే జగన్ వీటిపై ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు. కానీ అయన సోమవారం నాడు జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో మాట్లాడారు. ఇలాంటి మీటింగ్స్ లోనే పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు గత కొంత కాలంగా. కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీడియా పై ఎటాక్ చేశారు తప్ప అటు నడ్డా, ఇటు అమిత్ షా చేసిన ఘాటు విమర్శలకు కౌంటర్ కాదు కదా అసలు వాళ్ళ పేరు ఎత్తకుండా బీజేపీ మనకు అండగా ఉండకపోవొచ్చు అంటూ మాట్లాడారు. ఇది ఒక్కటే సీఎం జగన్ చేసిన కామెంట్. అయితే తాను వాళ్ళు ఎవరినీ నమ్ము కోలేదు అని స్పందించారు. ఎప్పటిలాగానే చంద్రబాబు పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. టీడీపీ కొత్తగా ప్రకటించిన మేనిఫెస్టో టార్గెట్ గా అయన విమర్శలు సాగాయి. చంద్రబాబు ఎన్నికల ముందు వాగ్దానం చేస్తారు ...ఎన్నికల తర్వాత మోసం చేస్తారు. . రైతులు. బీసీలు, ఎస్ సి లకు ఏమి చేశాడు అంటే మోసం తప్ప మరొకటి లేదు. చంద్రబాబు నాయుడు పేరు చెపితే ఒక్క పథకం కూడా గుర్తు రాదు. మూసేయటానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్క రాష్ట్రాల మేనిఫెస్టో లు తెచ్చి కిచిడి చేసి...పులిహోరగా మారుస్తున్నారు. పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఏమి చేయలేదు కానీ ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్, బీసీ, ఎస్సి, మైనారిటీ డిక్లరేషన్ అంటూ మొదలెట్టాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా అని అడుగుతున్నా. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తాను నమ్ముకున్నది ప్రజలను. అంతే కానీ ఎవరినీ కాదు అంటూ జగన్ రియాక్ట్ అయ్యారు.

Next Story
Share it