Telugu Gateway
Telugugateway Exclusives

జగన్ బ్లేమ్ గేమ్ బూమరాంగ్?!

జగన్ బ్లేమ్ గేమ్ బూమరాంగ్?!
X

అంతా కేంద్రమే చేస్తుంటే..బంధుత్వాల లెక్కలేంటి?

సీఎం చెప్పదలచుకున్న సందేశం ఏంటి?

వ్యాక్సిన్ల కేటాయింపు కేంద్రానిదే అంటూ తాజాగా వ్యాఖ్యలు

ఇప్పుడు చంద్రబాబు..రామోజీరావు బంధుత్వం అంటూ కొత్త వాదన

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వ్యాక్సిన్ల కేటాయింపు పూర్తిగా కేంద్రం చేతిలో ఉందని ప్రకటించారు. రాష్ట్రాలకు కూడా ఎంత వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారని తెలిపారు. దేశంలో తయారు అవుతున్న వ్యాక్సిన్లలో 50 శాతం వాటాను నేరుగా కేంద్రం తీసుకుని..మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలకు అమ్ముకునే వెసులుబాటు ఆయా తయారీ సంస్థలకు ఇస్తూ కేంద్రం కొద్ది రోజుల క్రితం విధాన నిర్ణయం తీసుకుంది. అయితే అంతా కేంద్రం చేస్తుంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన బంధుత్వాల పంచాయతీలేంటి?. ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్లు అమ్మాలన్నది కూడా జగన్ చెప్పినట్లు కేంద్రమే డిసైడ్ చేసేటప్పుడు భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా చంద్రబాబుకు బంధువు అయితే ఏంటి?. రామోజీరావు కొడుకు వియ్యంకుడు అయితే ఏంటి?. నిజానికి చంద్రబాబుకు..కృష్ణ ఎల్లాకు బంధుత్వం లేదు. కానీ జగన్ మంగళవారం నాడు ఓ సమావేశంలో మాట్లాడుతూ వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి అని రాష్ట్రంలో ఉన్న వారికి..దేశంలో ఉన్న వారికి అందరికీ తెలుసు. నెలకు ఏడు కోట్ల వ్యాక్సిన్ల తయారీ సామర్ధ్యం ఉందని మాత్రమే ఉందనే విషయం అందరికీ తెలుసు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నాడని బాధపడే ఎల్లో మీడియాకూ తెలుసు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ భారత్ బయోటెక్ ఎవరిది అంటే సాక్ష్యాత్తూ చంద్రబాబునాయుడి బంధువు. రామోజీరావు కొడుకు వియ్యంకుడు, వ్యాక్సిన్ కంపెనీల్లో ఏమి జరుగుతుందో వాళ్లకు తెలుసు. అయినా కూడా వక్రీకరించే పనిచేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ విషయంలో కానీ..మరో విషయంలో అయినా ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు చేసే విమర్శలను వైసీపీ తిప్పికొట్టడాన్ని ఎవరూ ఆక్షేపించరు. చంద్రబాబు చెప్పే దాంట్లో నిజాలు లేకపోతే ఆ విషయాలను ప్రజలకు చెప్పొచ్చు. ఈ విషయంలో వైసీపీ ఎక్కడా వెనకాడటం లేదు..అంతే కాదు..చాలా శక్తివంతమైన దాడే చేస్తోంది. కానీ వ్యాక్సిన్ విషయంలో కూడా ఇప్పుడు సీఎం జగన్ బంధుత్వాల విషయాన్ని తెరపైకి తెచ్చి..ఈ కారణంగానే ఏపీ ప్రజలకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు ఇవ్వటం లేదని చెప్పదలచుకున్నారా?. స్వయంగా జగనే ఎవరికి ఎన్ని వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తున్నది అని చెప్పినప్పుడు అసలు ఈ బంధుత్వాల లెక్కలేంటి?

Next Story
Share it