వైసీపీ వాయిస్ కు వైఎస్ జగన్ ఈ సారైనా చోటిస్తారా?
దీంతో అప్పట్లో వైసీపీ నేతలు కూడా ఒకింత షాక్ కు గురయ్యారు. రోజా తన అసంతృప్తి వ్యక్తం చేయగా..ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అంబటికి అలాంటిది కూడా ఏమీలేదు. ఇప్పుడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం కావటంతో గతంలో పార్టీ వాయిస్ బలంగా విన్పించిన అంబటి రాంబాబు, రోజాలకు ఈ సారైనా ఛాన్స్ వస్తుందా లేదా అన్న అంశాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. వీరిద్దరితోపాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డికి తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం జగన్ ప్రకటించారు. దీంతో ఆయనకు ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరో నేత మర్రి రాజశేఖర్ కు గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేకపోయినందుకు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ ఎమ్మెల్సీ హామీనే అమలుకు నోచుకోలేదు. ఈ సారి జగన్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తారో వేచిచూడాల్సిందే.