Telugu Gateway
Telugugateway Exclusives

ఏపీ బిజెపి అదిరిపోయే కామెడీ

ఏపీ బిజెపి అదిరిపోయే కామెడీ
X

ఒక ఎంపీ సీటుకు మద్దతు కోరుతూ పవన్ ను సీఎం చేస్తామని ఆఫర్

తిరుపతి ఎన్నికల ఎఫెక్ట్...సీఎం జగన్ పైనా తీవ్ర విమర్శలు

ఒకప్పుడు గ్రామాల్లో సారా కాసేవారు

జగన్ సర్కారే బూమ్ బూమ్..స్పెషల్ స్టేటస్ అంటూ ఏవేవో కాస్తుంది

ఎర్రచందనం స్మగ్లర్ల వెనకపడతారని వికలాంగుడైన డిఎస్పీకి బాధ్యతలా?

ఏపీలో ఒక ఎంపీ సీటు గెలిచించేందుకు బిజెపి పార్టీ జనసేన మద్దతు కోరుతోంది. ఏపీ విషయానికి వస్తే బిజెపితో పోలిస్తే జనసేనే బలమైన పార్టీ. ఇది ఎవరూ కాదనిలేని వాస్తవం. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు. కానీ ఏపీలో ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్నంత వ్యతిరేకత గతంలోఎన్నడూలేదనే చెప్పొచ్చు. ఇందుకు కారణాలు ఎన్నో. అయితే తిరుపతి ఎంపీ సీటు గెలిచేందుకు జనసేన మద్దతు కోరుతున్న బిజెపి..ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఓ వైపు పవన్ ను పొగుడుతూ సీఎం జగన్ పై తీవ్రమైన విమర్శలు చేస్తోంది. అంతా తిరుపతి ఎన్నికల ఎఫెక్ట్. 'పవన్ కళ్యాణ్ ను గౌరవించాలి..ఆయన్ను రాష్ట్రానికి అధిపతిని చేయాలనే ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది'. ఇవి సోము వీర్రాజు వ్యాఖ్యలు.

బలం విషయంలో జనసేన కంటే ఎంతో వెనకున్న బిజెపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర అధినేతను చేస్తామని ప్రకటించటం కామెడీగా ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆదివారం నాడు బిజెపి-జనసేనల సమన్వయ కమిటీ సమావేశంలో సోము వీర్రాజు గతంలో ఎన్నడూలేని రీతిలో సీఎం జగన్ పై కూడా విమర్శలు చేశారు. జగన్ సర్కారు నకిలీ ప్రభుత్వం అంటూ..రూలింగ్ కాకుండా ట్రేడింగ్ చేస్తోస్తందని ఆరోపించారు. పరిపాలన ఎందుకంటే ఇవాళ వ్యాపారాం చేయటం కోసం అన్నట్లు తయారైందన్నారు. గతంలో సారా గ్రామాల్లో కాసి అమ్మేవారు. జగన్ ప్రభుత్వంలో ఆయనే కాసేస్తున్నాడు బూమ్ బూమ్ బీర్లు కానీ..స్పెషల్ స్టేటస్ కానీ. ప్రభుత్వమే బ్రాందీ. సారాను కాసేస్తుంది. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను నిరోధించేందుకు గతంలో డీఐజీ క్యాడర్ లో కాంతారావు అనే అధికారి ఉండేవారు. పెద్ద ఎత్తున స్టాఫ్ కూడా ఉండేవారు. ఇప్పుడు ఓ డీఎస్సీని..అది కూడా వికలాంగుడిని నియమించారు.

ఎక్కడ స్మగ్లర్ల వెనకపడతారో అని. ఎంత దారుణమో చూడండి..ఎంత ధైర్యమో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలు అనేకం ఉన్నాయి..దీన్నే మనం ఎదుర్కోగలం. మనం తప్ప..ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం లేదు. జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బిజెపి, జనసేన మాత్రమే అన్నారు. అంతే కాదు..ప్రధాని మోడీకి..హోం మంత్రికి కి పవన్ పై ప్రత్యేక అభిమానం ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇరు పార్టీల మధ్య వచ్చిన గ్యాప్ కారణంగా చివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారంలోకి వచ్చి బిజెపి అభ్యర్ధికి ఓటు వేయాలని కోరినా కూడా అందుకు క్యాడర్ సిద్ధంగా లేరని..కావాలంటే నోటాకు అయినా వేసుకుంటాం కానీ..బిజెపికి మాత్రం వేయం అని కొంత మంది తీర్మానాలు సైతం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంత కాలం కూడా సర్కారు మద్యం విషయంలో పెద్దగా విమర్శలు చేయకుండా..ఇప్పుడే ఎన్నికల కోసం సోము వీర్రాజు డోస్ పెంచినట్లు ఉన్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it