Telugu Gateway
Telugugateway Exclusives

'ఏపీ స‌ల‌హాదారు' బిగ్ స్కెచ్!

ఏపీ స‌ల‌హాదారు బిగ్ స్కెచ్!
X

ఏకంగా వంద టెక్స్ టైల్స్ షోరూమ్స్ ప్రారంభానికి స‌న్నాహాలు

తాజాగా చేనేత వ‌ర్గాల వారితో కీల‌క స‌మావేశం

ఏపీలో ఏ వ్యాపారం అయినా తామే చేయాల‌న్న‌ట్లు ఉంది వారి కొంత మంది తీరు. స‌ర్కారులోని స‌ల‌హాదారుల్లో ఓ కీల‌క వ్య‌క్తి 'బిగ్ స్కెచ్' వేశారు. ఏకంగా రాష్ట్ర‌మంత‌టా ఒకేసారి వంద టెక్స్ టైల్స్ షోరూమ్స్ ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మేర‌కు ఇటీవ‌ల ప‌లు కీల‌క స‌మావేశాలు జ‌రిగాయి. అంతే కాదు.. ఈరంగంలో విశేష అనుభ‌వం ఉన్న‌ వారిని ఇంటికి పిలిపించుకుని మ‌రీ ఒక్కో షాప్ ఏర్పాటుకు ఎంత వ్య‌యం అవుతుంది?. లాభాలు ఎలా ఉంటాయి వంటి అంశాల‌పై ఆరా తీశారు. అంతే కాదు...ఇటీవ‌లే కొత్త‌గా ప్రారంభం అయిన టెక్స్ టైల్స్ షోరూమ్ ప్రారంభించిన స‌మ‌యంలోనే ఈ ఆలోచ‌న పుట్టిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని చేనేత వ‌ర్గాల వారితోనూ ఈ స‌మావేశం నిర్వ‌హించి వివిధ ర‌కాల మెటీరియ‌ల్స్ సేక‌ర‌ణ‌పై కూడా చ‌ర్చ‌లు సాగించారు.

ఇప్పుడు రాష్ట్రంలోని కీల‌క ప్రాంతాల్లో స్థ‌లాల అన్వేష‌ణ ప్రారంభం అయింద‌ని..ఇందుకు ఆ స‌ల‌హాదారు త‌న ప‌ర‌ప‌తిని అంతా ఉప‌యోగిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఆయ‌న త‌ల‌చుకుంటే పెద్ద‌గా ఇబ్బందులు కూడా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆయ‌న ప‌ర‌ప‌తి అలాంటిది మ‌రి. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మ‌ద్యంతోపాటు ఇసుక అంతా కూడా సెంట్ర‌లైజ్డ్ వ్యాపారంగా మారిపోయింది. అదే త‌ర‌హాలో ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన టెక్స్ టైల్ వ్యాపారంపై ఆ స‌ల‌హాదారు క‌న్నేశార‌ని చెబుతున్నారు. దేశంలో ప్ర‌జ‌లకు ఎప్పుడు ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా నిత్యం కొన‌సాగే వ్యాపారాల్లో ఫార్మాతోపాటు బ‌ట్ట‌ల షాప్ ల బిజినెస్ కూడా కీల‌కంగా ఉంటుంది. అందుకే రాష్ట్ర‌వ్యాప్తంగా ఏకంగా వంద చోట్ల షాపుల‌ను ప్రారంభించ‌టం ద్వారా మొత్తం ఈ వ్య‌వ‌హారంపై ప‌ట్టు సాధించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఆయ‌న త‌న వ్యాపారానికి ఏ బ్రాండ్ పేరు పెడ‌తారు...ఎవ‌రిని ముందు పెడ‌తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it