డబ్బులిస్తే అల్లు అర్జున్ ఏ యాడ్స్ లో అయినా చేస్తారా?!
ఒక్కడే విద్యార్ధిని ఖాతాల్లో వేసుకున్న శ్రీచైతన్య, నారాయణతోపాటుమరికొన్ని సంస్థలు
అల్లు అర్జున్. హీరోగా కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. మంచి నటుడు...డ్యాన్సర్ కూడా. ఆయన తాజాగా శ్రీచైతన్య విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. పిల్లలతో కలసి 'తగ్గేదేలే' అంటున్నారు. ఎందులో తగ్గరు?. ఎక్కడ తగ్గరు. తప్పుడు యాడ్స్ లోనా?. దొంగ క్లెయిమ్స్ లోనా?. మరి ఇప్పుడు ఈ బోగస్ క్లెయిమ్ లకు అల్లు అర్జున్ బాధ్యత వహిస్తారా?. ఇది పిల్లలను తప్పుదారి పట్టించటం కాదా?.అల్లు అర్జున్ టాలీవుడ్ లోని పాపులర్ హీరో. అందులో ఆయనకు యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువ. మరి చదువుకునే విద్యార్ధులను ఇది తప్పుదారి పట్టించటం కాదా?. శ్రీచైతన్య చేసిన తప్పుకు బాధ్యత ఆ సంస్థదా?. లేక అల్లు అర్జున్ దా?.అసలు ఆ స్టూడెంట్ ఎక్కడ చదివాడు. అసలు ఎవరు కోచింగ్ ఇచ్చారు. ఒక్కడే విద్యార్ధి. కానీ ఏకంగా నాలుగు సంస్థల తమ విద్యార్ధే అంటూ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు. అంతే కాదు..ఏకంగా ఫస్ట్ పేజీల ప్రకటనలు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నాలుగు సంస్థలు ఒకే విద్యార్ధిని తమ ఖాతాలో వేసుకున్నాయి.
ఒకరు ఆన్ లైన్ ట్రైనింగ్ అంటే..మరొకరు మరో పేరు పెట్టారు. అసలు ఒక విద్యార్ధి ఏకకాలంలో నాలుగు సంస్థల్లో శిక్షణ తీసుకోవటం సాధ్యం అయ్యే పనేనా?.అసలు నిజంగా ఆ విద్యార్ధి ఎక్కడ చదివారు. మరి ఒకడే విద్యార్ధిని శ్రీచైతన్య, నారాయణతోపాటు ఎలెన్ కెరీర్ ఇన్ స్టిట్యూట్, ఫిట్ జీ సంస్థలు తమ యాడ్స్ లో ఒక్కడే ఫోటోను ప్రచురించాయి. తాజాగా వెల్లడైన జెఈఈ అడ్వాన్స్ డ్ అఖిలభారత స్థాయి ఓపెన్ కేటగిరీలో మృదుల్ అగర్వాల్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించినట్లు నాలుగు సంస్థలు పత్రికల నిండా యాడ్స్ కుమ్మేశాయి. అందరూ నెంబర్ వన్ ర్యాంక్ తమకే వచ్చిందని చెబుతున్నాయి. ఒకటే ర్యాంక్ నాలుగు సంస్థలకు ఎలా వస్తుంది. అది సాధ్యం అయ్యే పనేనా?. అయితే ఈ యాడ్స్ ను పరిశీలిస్తే మృదుల్ అగర్వాల్ అలెన్ కెరీర్ ఇన్ స్టిట్యూట్ టీ షర్ట్ వేసుకున్న ఫోటో మాత్రమే అధికారికంగా కన్పిస్తోంది. మరి శ్రీచైతన్య, నారాయణ, ఫిట్ జీలు కూడా నెంబర్ వన్ ర్యాంక్ తమ విద్యార్ధికి వచ్చినట్లు ఎలా ప్రకటించుకుంటాయి. అందరూ ఒకటే హాల్ టికెట్ నెంబర్, ఆ విద్యార్ధి ఫోటోను వాడేసుకున్నాయి. ఇదొక్కటే కాదు..ఇలాంటి విచిత్రాలు ఈ యాడ్స్ లో ఇంకా చాలా ఉన్నాయని ఈ వ్యవహారం గమనించిన విద్యా రంగానికి చెందిన వారు చెబుతున్నారు.