Telugu Gateway
Telangana

పోలీస్ లపై దాడులేంటో ?!

పోలీస్ లపై  దాడులేంటో ?!
X

ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలు..ప్రజల్లో హాట్ టాపిక్. సహజంగా నాయకులను అడ్డుకునే సమయంలో తోపులాటలు సహజం. ఇది చాలా సార్లు జరిగింది. కానీ ఏకంగా పోలీస్ లపై దాడి చేయటం అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల పోలీస్ లపై దాడి చేశారు. ఆమెను పరామర్శించేందుకు జూబ్లీ హిల్స్ స్టేషన్ కు చేరుకున్న వై ఎస్ విజయమ్మ కూడా పోలీస్ సిబ్బంది చెంప చెల్లుమనిపించారు. ఈ రెండు ఘటనలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సోమవారం ఉదయమే వై ఎస్ షర్మిల ఇంట్లోనుంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు . అసలు తనను బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఆమె ప్రశ్నిస్తూ పోలిసుల తో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలోనే పోలీస్ లను తోసి వేయటంతో పాటు కొంత మంది పై చేయి కూడా చేసుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ లోకి విజయమ్మను అనుమంతించక పోవటంతో ఆమె కూడా అక్కడ ఘర్షణకు దిగి..తర్వాత ఒకరి పై చేయి చేసుకున్నారు. ఈ రెండు ఘటనలు చూసిన వారు అవాక్కు అవ్వటమే కాదు..అసలు వీళ్లిద్దరికీ పోలీస్ లపై చేయి చేసుకునే దైర్యం ఎక్కడనుంచి వచ్చింది..అసలు దీని వెనక కథ ఏంటి అన్న చర్చ ప్రారంభం అయింది.

తెలంగాణ సీఎం కెసిఆర్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకుంటూనే ఉన్నారు చివరకు ధర్నా చేయాలన్న కోర్ట్ కి వెళ్లి అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఈ విషయం లో ఒక్క అధికార పార్టీ కి తప్ప ఎవరికీ మినహాయింపులు ఉండటం లేదు. ఇప్పుడు అలాగే వై ఎస్ షర్మిల విషయంలోనే వ్యవహరించారు. అయితే ఇది ఏకంగా పోలీస్ లపై దాడి వరకు వెళ్ళటం అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తమను అడ్డుకునే పని తప్ప మీకు పనేమీ లేదా, పని లేక పోతే గాడిదలు కాసుకోండి వెళ్లి అంటూ అంటూ షర్మిల రోడ్ పై బైఠాయించిన సమయంలో కామెంట్ చేయగా ఒక అధికారి అదే పని చేస్తున్నాం అనటం వినిపిస్తుంది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తాను పేపర్ ల లీక్ అంశంపై సిట్ అధికారులను కలిసేందుకు వెళుతుంటే ఇలా అడ్డుకోవటం ఏమిటీ...తాను ఎలాంటి ధర్నా కు, నిరసనలకు కూడా పిలుపు ఇవ్వలేదు అని షర్మిల చెపుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు తానే ఏమైనా క్రిమినల్ నా అని షర్మిల ప్రశ్నించారు.

Next Story
Share it