కెసీఆర్...విజయశాంతి ఇక్కడి వాళ్ళేనా?
నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
పార్టీపై త్వరలో ప్రకటన
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో పార్టీ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్న వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె బుధవారం నాడు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పలు అంశాలపై ఆమె తన వైఖరిని కుండబద్ధలు కొట్టారు. 'నాకు విజయమ్మ సంపూర్ణ మద్దతు ఉంది. నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. విజయశాంతి, కెసీఆర్ ఇక్కడి వారా?. త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుంది. తెలంగాణ వచ్చాక సమస్యలు తీరాయా? ఉద్యమంలో నేను లేనంత మాత్రాన తెలంగాణపై ప్రేమ ఉండదా?. జగన్ తో ఉన్నది విభేదాలో..భిన్నాభిప్రయాలో తెలియదు. నేను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు.
మాటలు..అనుబంధాలు..రాఖీలు ఉంటాయి. నేను పెట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదు. నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగండి. నేను ఎవరూ వదిలిన బాణాన్ని కాదు. తెలంగాణ వచ్చాక సమస్యలు తీరాయా? అమరులు ఆకాంక్షలు నెరవేరాయా? . రాష్ట్రంలో ఆరోగ్యశ్రీను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తెలంగాణ అభివృద్ధి ఎవరికీ చిత్తశుద్ధి లేదు. ఉద్యమం అంటూ ఒకరు..మతం అంటూ ఒకరు రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో వైసీపీ ఎక్కడ ఉంది?. కొత్త పార్టీ అవసరం ఉంది. నేనూ ముమ్మాటికి తెలంగాణ బిడ్డనే. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తా.' అని ప్రకటించారు.