షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా!
BY Admin13 Feb 2021 11:12 AM

X
Admin13 Feb 2021 11:12 AM
తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఖమ్మం పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇంతకు ముందు ఖరారు అయిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈనెల 21న భారీ ర్యాలీతో బయల్దేరి ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తాజాగా ఈ పర్యటన వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే ఖమ్మంలో షర్మిల పర్యటించనున్నారు.
మార్చి 14 తర్వాత షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నుంచి లోటస్‌పాండ్‌లో ప్రతి శుక్రవారం అభిమానులతో షర్మిల భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా అభిమానులతో షర్మిల సమావేశాలు జరపనున్నారు. అయితే ఈ లోగా వేరే జిల్లాలో పర్యటిస్తారా లేదా అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story