Telugu Gateway
Telangana

వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్ షర్మిల అరెస్ట్
X

నిరుద్యోగుల ఆత్మహత్యలపై కెసీఆర్ సమాధానం చెప్పాలి

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్ దగ్గర దీక్ష ముగిసిన తర్వాత వైఎస్ షర్మిల కాలినడకన లోటస్ పాండ్ కు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు. షర్మిల వెంట ఉన్న వారికి మధ్య ఒకింత ఘర్షణ జరిగింది. తోపులాటలో షర్మిల కిందపడిపోయారు. తర్వాత అమెను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉంటే వై ఎస్ షర్మిల ముందు ప్రకటించినట్లుగానే గురువారం నాడు హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కోరుతూ దీక్షకు కూర్చున్నారు. ఆమె వాస్తవానికి మూడు రోజుల దీక్ష తలపెట్టగా..కరోనా పేరు చెప్పి తెలంగాణ సర్కారు ఒక్క రోజు మాత్రమే అనుమతి మంజూరు చేసింది.

ఈ దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడుతూ నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కెసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎవరు మాట్లాడకపోయినా తాము వారికి అండగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ అంశంపై దీక్షలు కొనసాగుతాయన్నారు. నిరుద్యోగుల సమస్యపై కెసీఆర్ సరిగా స్పందించటంలేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముందు ఉండి పోరాటం చేసిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సీఎం కెసీఆర్ పై ఉందన్నారు.

Next Story
Share it