అఖిలేష్ తో భేటీపై కెసిఆర్ మౌనం వెనక మతలబు ఏంటి?!
మరో వైపు అఖిలేష్ యాదవ్ మాత్రం కేంద్రంలోని బీజేపీ , మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించటానికి అందరూ కలవాల్సిన అవసరం ఉంది అన్నారు. మరో వైపు కెసిఆర్ సొంత పత్రికలో బీజేపీ ని ఓడించటానికి కెసిఆర్ అనుభవం, మద్దదు అవసరం, అసలు బిఆర్ఎస్ లేకుండా ఏమీ కాదు అని చెప్పినట్లు రాసుకున్నారు. మరి సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ సందేశాలు ఇచ్చినట్లు పార్టీ లు ఉన్నది ఒకరిని గద్దె దించటానికి కాదు...కలవాల్సింది పార్టీ లు కాదు..ప్రజలు అని చెప్పారా?. లేక తెర వెనక రాజకీయాలపై ఫోకస్ పెట్టారా?. ఇన్ని గంటలు కెసిఆర్, అఖిలేష్ యాదవ్ భేటీపై బిఆర్ఎస్ తన పార్టీ వైఖరి ఏంటో చెప్పలేదు అంటేనే ఇందులో ఏదో తేడా ఉంది అనే విషయం అర్ధం అవుతుంది అనే చర్చ సాగుతోంది. మరో వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం సభలో చాలా చాలా స్పష్టంగా బిఆర్ఎస్ ని ఎట్టి పరిస్థితుల్లో తమ కూటమిలోకి రానివ్వం అని చెప్పిన వెంటనే కెసిఆర్, అఖిలేష్ యాదవ్ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. కెసిఆర్ ఇప్పుడు విపక్ష కూటమిలో చీలికకు ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు కూడా కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ స్టాండ్ తరచూ మారుతూ పోతుంది అని..ఇది అంతిమంగా బిఆర్ఎస్ నష్టం చేయటం ఖాయం అనే భయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.