Telugu Gateway
Telangana

ఐటిఐఆర్ ఆపేసి..ప్రపంచ ఐటి హబ్ చేస్తారా?

ఐటిఐఆర్ ఆపేసి..ప్రపంచ ఐటి హబ్ చేస్తారా?
X

హైదరాబాద్ కు యూపీఏ హయాంలో కేటాయించిన ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఐటిఐఆర్)ను ఆపేసిన ఎన్డీయే సర్కారు ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ ఐటి హబ్ గా మారుస్తామని ప్రకటించటం విడ్డూరంగా ఉందని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ను పిచ్చోళ్ళ చేతిలో పెట్టొద్దని ఓటర్లను హెచ్చరించారు. జంగిల్ రాజ్ యూపీ నుంచి వచ్చిన ఆయన ఇక్కడ నీతులు చెబుతున్నారంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంపై విమర్శలు సంధించారు. బేచో ఇండియా అని మోడీ కొత్త స్కీమ్ పెట్టాడని విమర్శించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున కెటీఆర్ పలు సభల్లో మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు..'హైదరాబాద్ లో ఎలాంటి గొడవులు..కర్ఫ్యూలు లేవు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఉత్త చేతులతో వచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇతర మంత్రులతో కలసి నేను నగరంలో పర్యటించా. వరద సాయం చేస్తే కెసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆపేశారు.

మాది నిజాం సంస్కృతి కాదు. ఆరేళ్ళలో ఎన్డీయే సర్కారు తెలంగాణకు ఏమి ఇచ్చింది?. జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షలు ఎంత మందికి వేశారు. హైదరాబాద్ లో మంచి వాతావరణం ఉంది. దాన్ని చెడగొటేప్రయత్నం చేస్తున్నారు. ఈ వాతావరణం చూసే రాస్టానికి పెట్టుబడులు వస్తున్నాయి. యోగి, జోగి రాసుకుంటే ఏమి రాలుతుంది. 6 లక్షల 46 వేల కుటుంబాలకు సాయం చేశాం. మిగిలిన వారికి కూడా డిసెంబర్ 7 తర్వాత చేస్తాం.. మరో 300 నుంచి 400 కోట్లు అయినా వెనకాడం. కెసీఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారు. మీ మాటలునమ్మేందుకు ఇది అహ్మాదాబాద్ కాదు..హుషార్ హైదరాబాద్, హైదరాబాద్ లో హిందూ ముస్లిం పంచాయతీలు లేవు.

ఆంధ్రా,తెలంగాణ పంచాయతీ లేదు. ఒక పిచ్చోడు ఎన్టీఆర్, పీవీ సమాధులు కూలగొడతానంటాడు. మరో పిచ్చోడు మీ ఆఫీసు కూలగొడతా అంటున్నాడు. సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి రెండేళ్లలో ఎన్ని నిదులు తెచ్చారు. ఎవరి పడితే వారికి హైదరాబాద్ అప్పగించొద్దు. సర్జికల్ స్ట్రైక్స్ ఎవరి మీద చేస్తాం. మత పిచ్చితో మన మధ్య చిచ్చు పెట్టే ధుర్మార్గులను గెలిపిద్దామా అఆలోచించండి. టీఆర్ఎస్ నినాదం విశ్వనరగం, వాళ్ల నినాదం విద్వేష నగరం. అగ్గి పెట్టుడు చాలా ఈజీ, దాన్ని ఆర్పుడు చాలా కష్టం. వాళ్ళు కూలగొట్టే పనిలో ఉన్నారు. అథోగతి కావాలా? పురోగతి కావాల? ' ఆలోచించుకోండి అని కెటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it